https://oktelugu.com/

Devara Movie Collection : త్రిబుల్ ఆర్ ‘ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ను దేవర మూవీ బ్రేక్ చేస్తుందా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది. ఇక్కడ చాలామంది అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళు దక్కించుకున్న అవకాశాల వల్ల వాళ్లకు సక్సెస్ వచ్చిందా లేదా అనే విషయం పక్కన పెడితే ఎలాగైనా సరే ఇండస్ట్రీలో మనం కూడా ఉండాలి అనే కాన్సెప్ట్ తో ముందుకు కదిలే వాళ్ళు చాలామంది ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 25, 2024 / 10:27 AM IST

    Devara Movie Collection

    Follow us on

    Devara Movie Collection :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నా నటులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మాత్రం తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక దేవర సినిమాతో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈయన ఈ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా భారీ సక్సెస్ ని సాధించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాను అని చెబుతున్న కొరటాల శివ కూడా ఈ సినిమా సక్సెస్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ఈ సినిమాకి మొదటి నుంచి కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్ ట్రైలర్ ప్రేక్షకుల్ని కొంతవరకు అలరించినప్పటికీ ప్రేక్షకులను మాత్రం ఏ మాత్రం మెప్పించలేకపోయాయి.

    ఇక దానికి తోడుగా రీసెంట్ గా దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న క్రమంలో అత్యధిక మంది జనాలు రావడంతో ఈ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారు. మరి మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ కి ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకోని సంఘటనలైతే జరుగుతున్నాయి. మరి ఈ సినిమా సక్సెస్ తో ఆయనకు భారీ ఉత్సాహం వస్తుందా?

    లేదంటే సినిమా ప్లాప్ అయితే మరోసారి ఆయన డీలా పడుతాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమా మీద కొనసాగుతున్న బజ్ ను బట్టి చూస్తే ఈ సినిమాకి ఓపెనింగ్ కలెక్షన్స్ విషయంలో కొంత వరకు దెబ్బ పడే అవకాశాలైతే ఉన్నాయి. ఒక మొదటి రోజు ఈ సినిమా ఎంతవరకు వసూళ్లను కలెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి భారీ హైప్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

    అయినప్పటికీ ఓపెనింగ్ విషయంలో మాత్రం ఈ సినిమా కొంతవరకు నిరాశను మిగిల్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమాతో ఎన్టీఆర్ ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తాడు అనేది…ఇక ఓపెనింగ్స్ విషయంలో కూడా ఆయన ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేసాడు అనేది తెలియాల్సి ఉంది. ఇంకా ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమా మొదటి రోజు 233 కోట్ల కలెక్షన్లను రాబట్టి టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది. మరి ఈ సినిమా ఓపెనింగ్స్ త్రిబుల్ ఆర్ సినిమాను బ్రేక్ చేసే రేంజ్ లో ఉంటాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…