https://oktelugu.com/

Hyderabad: హాట్ టాపిక్: దుకాణాలు, వ్యాపారాల నిర్వహణ.. రేవంత్ రెడ్డి సర్కార్ మరో ఉత్తర్వులు

తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని, విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ వ్యాపారులకు శుభ వార్త చెప్పింది. వ్యాపారం చేసుకునే వేళలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : September 25, 2024 / 10:44 AM IST

    Hyderabad(5)

    Follow us on

    Hyderabad: హాట్ టాపిక్: తెలంగాణలోనే కాదు.. ఉమ్మడి రాష్ట్రంలోనూ హైదరాబాద్‌ కీలకం. లక్షలాది మంది ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నారు. తెలంగాణ వచ్చాక హైదరాబాద్‌ను ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసింది. వివిధ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయి. దీంతో విశ్వనగరంలో 24 గంటలు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రి ఉద్యోగాలు చేసే వారికి భోజనం దొరకడం కష్టంగా మారింది. అర్ధరాత్రి వరకు పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే వారు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి తర్వాత కూడా హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచాలని చాలాకాలంగా కోరుతున్నారు. తాజాగా ప్రభుత్వం ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లో అర్ధ రాత్రి 1 గంట వరకు నిర్వహించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.

    వీటికి అనుమతి..
    బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లతోపాటు సూపర్‌ మార్కెట్లు, జువెల్లరీ షాప్‌లు, వస్త్ర దుకాణాలు, కిరాణా దుకాణాలు ఉదయం 9 నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు నిర్వహించుకునే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైన్స్, లిక్కర్‌ అవుట్‌లెట్లు మాత్రం ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. జీహెచ్‌ఎంసీ నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వ్యాపారులకు కూడా ఇది వర్తిస్తుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 12 గంటల వరకు, శని, ఆదివారాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు షాపులు తెరిచి ఉంచుకోవచ్చు.

    ఫుడ్‌ బిజినెస్‌ ఇలా..
    ఇక విశ్వనగరంలో ఫుడ్‌ బిజినెస్‌కు డిమాండ్‌ ఎక్కువ. అందుకే హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహించుకునే అవకాశం కల్పించారు. ఇందులో హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఐస్‌క్రీం పార్లర్లు, బేకరీలు, టిపిన్‌ సెంటర్లు, కాఫీ షాపులు, టీ స్టాళ్లు, పాన్‌ షాపులు అర్ధరాత్రి 1 గంట వరకు నిర్వహించుకోవచ్చు. ఈ ఉత్తర్వులు డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోల అదుపులో ఉంటాయి. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.