దసరాకు ఆర్ఆర్ఆర్.. కానీ ట్విస్టు ఇదే..

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమా రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. ఈసారి జక్కన్న మల్టీస్టార్ తో కలిసి భారీ ప్రాజెక్టును మొదలు పెట్టాడు.ఈ సినిమాను కూడా మూడేళ్లలో పూర్తి చేద్దామనుకున్నారు. కానీ కరోనా రెండు విడుదలుగా సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ తరువాత సినిమా షూటింగ్ ఆగిపోయినా అక్టోబర్ 2021 లో విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. అంతలో సెకండ్ వేవ్ మొదలై షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడింది. అయితే […]

Written By: NARESH, Updated On : July 16, 2021 12:29 pm
Follow us on

టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి సినిమా రావాలంటే కనీసం మూడేళ్లు పడుతుంది. ఈసారి జక్కన్న మల్టీస్టార్ తో కలిసి భారీ ప్రాజెక్టును మొదలు పెట్టాడు.ఈ సినిమాను కూడా మూడేళ్లలో పూర్తి చేద్దామనుకున్నారు. కానీ కరోనా రెండు విడుదలుగా సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్ తరువాత సినిమా షూటింగ్ ఆగిపోయినా అక్టోబర్ 2021 లో విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. అంతలో సెకండ్ వేవ్ మొదలై షూటింగ్ కు మరోసారి బ్రేక్ పడింది. అయితే తాజగా పరిస్థితులు చక్కబడుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ టీం మేకింగ్ వీడియోను విడుదల చేశారు. దీంతో అబిమానుల్లో ఎనలేని ఉత్సాహం నెలకొంది.

ఈ వీడియోను చూస్తే జక్కన్న పనితనం మరోసారి అర్థమవుతోంది. బాహుబలి కంటే మించిన రేంజ్లో సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. అయతే ఈ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లోకి వస్తుందా..? లేదా..? అన్న సందేహాలు ప్రేక్షకుల్లో ఉండేవి. కానీ రాజమౌళి మాత్రం ఆ అనుమానాలను నివృత్తి చేసేశారు. ఏ పరిస్థితులు ఎదురైనా దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అనుకున్న సమయానికి సినిమా థియేటర్లోకి రాబోతుందని అర్థమవుతోంది.

ఇక సెకండ్ వేవ్ సమయంలోనే జక్కన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేశాడని చర్చించుకుంటున్నారు. మరోవైపు కమిట్మెంట్ తో ఉండడం చూసి ప్రేక్షకుల్లో కూడా ఉత్సాహం నెలకొంది. అయితే రాజమౌళి తనకు పరిస్థితులు అనుకూలిస్తే సినిమాను రిలీజ్ చేస్తాడు కావచ్చు. అయితే త్వరలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని కొందరు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదీ కాక తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లు పూర్తిగా తెరుచుకోలేదు.

దసరా వరకు థర్డ్ వేవ్ బాధ లేకుండే ఓకే. కానీ మళ్లీ లాక్డౌన్ గానీ.. ఇతర కారణాలు కానీ ఎదురైతే ఎలా..? అని కొందరు అంటున్నారు. అయితే రాజమౌళి మాత్రం ఎలాగైనా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ చేస్తాడట. ఆ తరువాత విడుదల విషయాన్ని మాత్ర నిర్మాత దానయ్యకే వదిలేయనున్నాడట. ఇక అన్నీ బాగుంటే దసరా కానుకగా థియేర్లోకి వస్తుంది. లేకుండా ఆ తరువాత అప్డేట్ వస్తుందని అనుకుంటున్నారు.