బాలయ్య తన విలువ కాపాడుకుంటాడా ?

బాలయ్య బాబు ఒకప్పుడు టాప్ హీరోనే. కానీ ఇప్పుడు ఏవరేజ్ హీరో రేంజ్ మార్కెట్ కూడా లేని హీరో. బాలయ్య సినిమా మార్కెట్ ఎప్పుడూ.. ఆయనతో కలిసి పని చేసే డైరెక్టర్లను బట్టే ఉంటుంది. బోయపాటి, క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ అయితే బాలయ్య సినిమాకి ముందే మార్కెట్ అయిపోతుంది. కానీ, ఫామ్ లో లేని డైరెక్టర్ అయితే… బాలయ్య రూలర్ సినిమాలా ఉంటుంది పరిస్థితి. అందుకే బాలయ్యతో సినిమా చేసేకంటే.. కొత్త హీరోతో డిఫరెంట్ కాన్సెప్ట్ […]

Written By: admin, Updated On : August 6, 2020 10:17 am
Follow us on


బాలయ్య బాబు ఒకప్పుడు టాప్ హీరోనే. కానీ ఇప్పుడు ఏవరేజ్ హీరో రేంజ్ మార్కెట్ కూడా లేని హీరో. బాలయ్య సినిమా మార్కెట్ ఎప్పుడూ.. ఆయనతో కలిసి పని చేసే డైరెక్టర్లను బట్టే ఉంటుంది. బోయపాటి, క్రిష్ లాంటి స్టార్ డైరెక్టర్ అయితే బాలయ్య సినిమాకి ముందే మార్కెట్ అయిపోతుంది. కానీ, ఫామ్ లో లేని డైరెక్టర్ అయితే… బాలయ్య రూలర్ సినిమాలా ఉంటుంది పరిస్థితి. అందుకే బాలయ్యతో సినిమా చేసేకంటే.. కొత్త హీరోతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయడం బెటర్ అని ఫీల్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు. సి కళ్యాణ్ ఇవే మాటలను ఓ డైరెక్టర్ తో పంచుకున్నారట. నిజానికి బాలయ్యతో సి కళ్యాణ్ మరో సినిమా ప్లాన్ లో ఉంది. అసలు కళ్యాణ్ సినిమా అంటే బాలయ్య రెమ్యునరేషన్ గురించి పెద్దగా పట్టించుకోరు.

Also Read: సీనియర్ హీరోకి దేవుడు పట్టాడు !

పైగా సినిమాకి బాలయ్య బల్క్ డేట్స్ కూడా ఇస్తాడు. రోజూ నాలుగు గంటలు ఎక్కువ షూట్ చేయమన్నా కోపరేట్ చేస్తాడు. ఇంత చేసినా బాలయ్యతో సినిమా చేయడానికి ప్రొడ్యూసర్లు ఎప్పుడూ భయపడుతూనే ఉండటం బాలయ్యకు ఇబ్బందే. సి.కళ్యాణ్ బాలయ్యతో ఇప్పటికే మూడు సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అలాంటి ఆయనే ఇప్పుడు బాలయ్య సినిమా నుండి తప్పుకుంటే ఇక మరో ప్రొడ్యూసర్ ఎందుకు ధైర్యం చేస్తాడు. మరి ఈ విషయం ఇండస్ట్రీలో అందరికి అర్ధం అవుతున్నా.. బాలయ్య వరకూ ఎందుకు వెళ్లడం లేదో. తోటి హీరోలంతా తమ మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ఎప్పుడూ ఆరాటపడుతూ ఉంటే.. బాలయ్య బాబు ఒక్కడే అసలు తన సినిమాకి కలెక్షన్స్ ఎన్ని వస్తున్నాయో అని కూడా అడగరు.

Also Read: హీరోలతో పడుకోలేదని..నన్ను వేధించారు: రవీనా టాండన్‌

అడిగినా ఆ ఫిగర్లు బాలయ్యను ఇబ్బంది పెట్టేవే. అసలు తన కెరీర్ లో అనేక సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీ టాప్ కలెక్షన్స్ ను రాబట్టిన బాలయ్య మొత్తానికి బాక్సాఫీస్ వద్ద చల్ల బడ్డారు. ఇది బాలకృష్ణ తప్పే. మొదటి నుండి కథల విషయంలో డైరెక్టర్ ల విషయంలో సరైన జడ్జ్ మెంట్ లేకుండా తనకు ఇష్టమైన వ్యక్తులకి ఏదో వరం ఇచ్చిన లెవల్లో ఛాన్స్ లు ఇచ్చి ఉన్న మార్కెట్ ని పోగొట్టుకున్నాడు. ఇప్పటికైనా సరైన కథలను, విశ్వసనీయత ఉన్న డైరెక్టర్ లను ఎంపిక చేసుకుంటేనే బాలయ్యకి బాక్సాఫీస్ వద్ద కనీస గౌరవం దక్కుతుంది. నిజానికి బాలయ్య మార్కెట్ రేంజ్ టాలీవుడ్ లో ఒకప్పుడు సెకెండ్ ప్లేస్.. మళ్ళీ తన సెకెండ్ పొజిషన్ ను సాధించలేక పోయినా అవమానకరమైన ప్లాప్స్ లేకుండా చూసుకున్నా బాలయ్య తన విలువను కాపాడుకున్న వాడు అవుతాడు.