https://oktelugu.com/

కీర్తి సురేశ్‌ పెళ్లి.. మళ్లీ లొల్లి

సౌత్‌లో ఇప్పుడు భారీ డిమాండ్‌ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేశ్‌ ముందుంటుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో బీజీగా మారింది. తమిళ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక కుమార్తె గా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయం అయిన ఆమె తక్కువ టైమ్‌లోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగింది. మహానటి తర్వాత క్షణం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 6, 2020 / 09:32 AM IST
    Follow us on


    సౌత్‌లో ఇప్పుడు భారీ డిమాండ్‌ ఉన్న హీరోయిన్లలో కీర్తి సురేశ్‌ ముందుంటుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు వరుస సినిమాలతో బీజీగా మారింది. తమిళ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక కుమార్తె గా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా వెండితెరకు పరిచయం అయిన ఆమె తక్కువ టైమ్‌లోనే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లో పాపులర్ హీరోయిన్‌గా ఎదిగింది. మహానటి తర్వాత క్షణం తీరికలేకుండా మారిందామె. కెరీర్ పరంగా ఇంత బిజీగా ఉన్న కీర్తి సురేశ్‌ త్వరలోనే పెళ్లి చేసుకోనుందంటూ వార్తలు వస్తున్నాయి. ఓ వ్యాపారవేత్తతో ఆమె మ్యారేజ్‌ ఫిక్స్‌ అయిందని, తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇదని వార్తలు వినిపించాయి. కానీ, రీసెంట్‌ ఇంటర్వ్యూస్‌లో వీటిని కీర్తి కొట్టి పారేసింది. ‘పెళ్లి వార్తలు నాకు కూడా ఆశ్చర్యం కలిగించాయి. ఇలాంటి పుకార్లు ఎలా సర్క్యూలేట్‌ అవుతున్నాయో నాకు కూడా అర్థం కావడం లేదు. ప్రస్తుతం నాకు అలాంటి ప్రణాళికలు లేవని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు’ అని వెండితెర మహానటి స్పష్టం చేసింది.

    Also Read: నితిన్‌కు విలన్‌గా నయనతార.. సాధ్యమేనా?

    అయితే, ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కీర్తి తొందర్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందట. కీర్తి సురేశ్‌ ఈ మధ్య కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. కొత్త కథలు కూడా వినడం లేదట. దానికి కారణం ఏమిటో ఆమె స్పష్టం చేయనప్పటికీ పెళ్లికి ప్రిపేర్ అవడం కోసమే ఆమె ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అయితే, తన వివాహం గురించి కీర్తి నుంచి గానీ, ఆమె కుటుంబ సభ్యుల గురించి గానీ ఇంత వరకూ అధికారిక ప్రకటన ఏదీ లేదు. కానీ, పెళ్లి గోల మళ్లీ మొదలవడంతో యువ నటి స్పందించకపోతే అది నిజమే అన్న అభిప్రాయం కలుగుతోంది.

    Also Read: ఫాలో ఫాలో.. రకుల్ ఇన్‌స్టా‌ ఫాలోవర్లు కోటిన్నర

    కాగా, సినిమా విషయానికి వస్తే కీర్తి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మలయాళంలో మరక్కార్, సింహం, తమిళ్‌లో రజనీకాంత్‌ అన్నార్తె మూవీలో నటిస్తున్న ఆమె.. తెలుగులో మిస్‌ ఇండియా, గుడ్‌ లక్‌ సఖీ, రంగ్‌ దే చిత్రాలు చేస్తోంది. పరశురామ్‌, మహేశ్‌ బాబు కాంబినేషన్లో వస్తున్న సర్కారు వారి పాటకు కూడా ఒప్పుకున్నట్టు కీర్తినే వెల్లడించింది.