Allu Arjun : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ చాలా సాఫీగా ముందుకు సాగుతూ వస్తుంది. కానీ రీసెంట్ గా పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట సంఘటన ద్వారా అల్లు అర్జున్ చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. దానికి కారణం ఏదైనా కూడా ఆయన ఆరోజు సంధ్య థియేటర్ కి పర్మిషన్ లేకపోయినా కూడా రావడం వల్లే అలాంటి సంఘటన జరిగిందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్న హీరో అల్లు అర్జున్ ఈయన చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 రిలీజ్ రోజున జరిగిన సంఘటనలో భాగంగా ఆయన రీసెంట్ గానే ప్రెస్ మీట్ పెట్టి అందులో తన తప్పు ఏం లేదని తెలియజేశారు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నాడనే చెప్పాలి. మరి ఆయన కేసులో దోషి గా తేలుతాడా? లేదంటే నిర్దోషిగా బయటికి రాగలుగుతాడా? అనేది తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే చాలామంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ అతనికి మద్దతుగా ఎవ్వరూ నిలవడం లేదు అంటూ కొంతమంది కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఆయన ఒక రోజు జైలు కి వెళ్లి వచ్చిన తర్వాత అతని దగ్గరికి స్టార్ హీరోలందరు పరమర్శించారు. ఇక దానివల్ల ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కాబట్టి ఇప్పుడు మిగతా హీరోలు ఎవరు కూడా అతనికి మద్దతుగా ట్వీట్లు గాని, లేదంటే మాట్లాడడం కానీ చేయడం లేదు కారణం ఏంటి అంటే ఇందులో ఒక మహిళ మరణం జరిగిన తర్వాత పిల్లాడి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్ మీద ఉంది. ఆయన అలాంటివి ఏమీ చూసుకోకుండా ఉండడంతో ఈ సంఘటన అనేది చాలా దూరం వెళుతుంది.
కాబట్టి ఇలాంటి సందర్భంలో మిగతా హీరోలు స్పందిస్తే వాళ్ల మీద కూడా నెగెటివిటి వచ్చే అవకాశం ఆయితే ఉంది. కాబట్టి మిగతా హీరోలు ఎవరు కూడా అల్లు అర్జున్ విషయంలో స్పందించడం లేదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే దీంట్లో డైరెక్ట్ గా సీఎం ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి మిగతా హీరోలు ఎవరు కూడా అలాంటి సాహసమైతే చేయడం లేదు.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ కి మద్దతుగా నిలిస్తే వాళ్ళకంటూ ఉన్న క్రేజ్ ను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి దాంతో పాటుగా ఆ హీరోల మీద నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ హీరో కూడా అతనికి మద్దతుగా ఇప్పుడు ఒక ట్వీట్ కూడా చేయడం లేదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…