Allu Arjun: దక్షిణాది రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలలో ఎవరికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనే టాపిక్ వస్తే ఎక్కువగా గుర్తు చేసే పేరు రజినీకాంత్. ఆ తర్వాత దళపతి విజయ్ పేరు వినిపిస్తుంటుంది. అయితే మొదటి నుంచే సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు ఎక్కువగా వినిపించడం వల్ల ఆయన పేరు మొదటి లైన్ లో ఉంది. ఆ తర్వాత దళపతి విజయ్ పేరు వినిపించడంతో ఈయన పేరు సెకండ్ వినిపిస్తోంది. అయితే రజనీ సినీ కెరీర్ లో చివరి దశలో ఉన్నారంటారు. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు 73 ఏళ్లు కాబట్టి ఇక సినిమా లైఫ్ తక్కువే అంటారు కొందరు.
ఇలాంటి సమయంలో దళపతి విజయ్ రజినీకాంత్ స్థానాన్ని రీప్లేస్ చేస్తాడని చాలా మంది అన్నారు. కానీ ఎవరు ఊహించని విధంగా ఈ సినిమాలకు గుడ్ బాయ్ చెప్పి రాజకీయాల్లోకి వెళ్లారు విజయ్. 2025లో సినిమాలకు పూర్తిగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాడట. ఇక ఈ ఇద్దరికి మించి సౌత్ ఇండస్ట్రీలో మరో హీరోకు అంత మార్కెట్ లేదంటారు. అటు శాండల్ వుడ్ లో యష్ కేజీఎఫ్ సిరీస్ లతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కానీ యష్ తదుపరి సినిమాపై ఆయన కెరీర్ ఆధారపడి ఉంటుంది.
ఇక మాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉన్న పెద్ద హీరో ఎవరు లేరనే చెప్పాలి. దుల్కర్ సల్మాన్ కు మంచి మార్కెట్ ఉన్నా కూడా రజినీకాంత్, విజయ్ లను క్రాస్ చేసేంత మార్కెట్ లేదంటారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే చాలా మంది హీరోలు మంచి మార్కెట్ తో దూసుకుపోతున్నారు. అంతేకాదు అటు హిందీలో కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. కానీ తమిళ, మలయాళ మార్కెట్ వద్ద పెద్దగా ప్రభావం చూపించడం లేదు మన హీరోలు. ప్రభాస్ లాంటి స్టార్ కూడా ఈ ప్రాంతాల్లో కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారట.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా మారేందుకు సిద్ధంగా ఉన్నారట. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కర్నాటకలో కూడా బలమైన మార్కెట్ ఉంది. అటు మలయాళం లోనూ బన్నీ సినిమాలకు భారీ కలెక్షన్లు వస్తుంటాయి. ఇక తమిళనాడులో పుష్ప అనూహ్య స్పందన అందుకుంది. అప్ కమింగ్ మూవీ పుష్ప2 కూడా ఇండియన్ సినీ హిస్టరీ లోని సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంటున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అంటే తన మార్కెట్ అక్కడ కూడా విస్తరించడం ఖాయం. అందుకే అందరు హీరోల కంటే ఈయన నెంబర్ వన్ గా మారేందుకు ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.