https://oktelugu.com/

Hero Yash: 50 రూపాయలతో కార్మికుడిగా మొదలైన హీరో యాష్ ప్రస్థానం 150 కోట్లకు ఎలా ఎదిగింది?

స్టార్ హీరో యష్ కూడా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కానీ దీని వెనుక చాలా కష్టాలు ఉన్నాయట. ఇక కేజీఎఫ్ సిరీస్ లు కేజీఎఫ్ 1,2 లు భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను ఆర్జించి పెట్టాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 6, 2024 / 02:20 PM IST

    Hero Yash

    Follow us on

    Hero Yash: పేదరికంలో ఉన్న వారు సక్సెస్ ను సాధించారంటే వారి సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో రాణించడం కూడా అంత ఈజీ కాదు. స్టార్ గా ఎదగాలంటే సినిమా ఆఫర్లు రావాలన్నా చాలా కష్ట పడాల్సిందే. అంతేకాదు సినీ బ్యాగ్రౌండ్ ఉన్నవారికి కూడా ఎంట్రీ ఈజీ కావచ్చు. కానీ సక్సెస్ ను సాధించడం కష్టమే. అయితే యష్ గురించి ఇండియాలోనూ పరిచయం అక్కర్లేదు. ఈయన నటించిన కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే.

    స్టార్ హీరో యష్ కూడా వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. కానీ దీని వెనుక చాలా కష్టాలు ఉన్నాయట. ఇక కేజీఎఫ్ సిరీస్ లు కేజీఎఫ్ 1,2 లు భాషతో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ లుగా నిలిచి నిర్మాతలకు మంచి లాభాలను ఆర్జించి పెట్టాయి. అయితే ఈ సినిమాల వల్ల యష్, ప్రశాంత్ నీల్ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పేరు మారుమోగింది.కానీ ఈ రేంజ్ కు రావడానికి యష్ చాలా కష్టపడ్డారట. అయితే 16 సంవత్సరాల వయసులో ఉన్న సమయంలో ఒక సినిమా కోసం తెర వెనుక కార్మికుడిగా పని చేశారు యష్.

    ఆ సమయంలో ఈయన రెమ్యూనరేషన్ కేవలం రూ. 50 మాత్రమేనట. ఇప్పుడు ఏకంగా రూ. 150 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. ఆ తర్వాత రోజుల్లో యష్ కు సీరియల్స్ నుంచి ఆఫర్లు వచ్చాయి. అయితే ఈ హీరో ఉత్తరయాన సీరియల్ తో కెరీర్ మొదలు పెట్టారు. ఇలా సీరియల్స్ లో నటించిన యష్ కు సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ వేర్వేరు కారణాల వల్ల నటించలేకపోయారట. ఆ సినిమాల్లో గనుక నటించి ఉంటే కొన్ని సంవత్సరాల ముందే స్టార్ స్టేటస్ వచ్చి ఉండేదట.

    మొదలసాలా అనే రొమాంటిక్ కామెడీ మూవీతో సక్సెస్ సాధించిన యష్ ఆ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలలో నటిస్తున్న యష్ భారీ విజయాన్ని అందుకుంటాననే నమ్మకంతో ఉన్నారట. ఇక ఇందులో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించనున్నారని టాక్.