కింగ్ నాగార్జున అప్ కమింగ్ మూవీ ‘వైల్డ్ డాగ్’. నవంబర్ లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో నాగ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్ వర్మగా కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ ‘రా’ ఏజెంట్ గా కీలక పాత్ర పోషిస్తోంది. మరో అందాల భామ దియా మీర్జా హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: భారీగా పడిపోయిన ‘చెక్’ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా..?
అయితే.. ఈ మూవీని కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఒప్పందాలు కూడా అయ్యాయి. కానీ.. సంక్రాంతి తర్వాత థియేట్రికల్ రిలీజ్ లు వేగం పుంజుకోవడంతో మేకర్స్ పునరాలోచనలో పడ్డారు. వైల్డ్ డాగ్ ను కూడా థియేటర్లోనే రిలీజ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో.. నెట్ ఫ్లిక్స్ తో ఏం మాట్లాడుకున్నారో తెలియదుగానీ.. మొత్తానికి సినిమాను థియేటర్ లో రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు.
నిజానికి.. బిగ్ స్క్రీన్ పై సినిమా చూడటానికే ప్రేక్షకులు ఇష్టపడతారు. ఫ్యాన్స్ ఖుషీ అవుతారు. సినిమా పాజిటివ్ టాక్ వస్తే.. కలెక్షన్లు అద్దిరిపోతాయి కూడా. ఈ లెక్క ప్రకారం చూస్తే.. ‘వైల్డ్ డాగ్’ ను థియేటర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకోవడం సరైందే. కానీ.. బిజినెస్ పరంగా చూసినప్పుడు ఈ నిర్ణయం సరైందేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి కారణాలు కూడా చాలా కనిపిస్తున్నాయి.
వాస్తవ పరిస్థితి చూస్తే.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ ఈ సినిమాను సుమారు రూ.35 కోట్లకు కొనేందుకు సిద్ధమైందని టాక్. నాగ్ ప్రస్తుత మార్కెట్ దృష్ట్యా ఇది మంచి మొత్తమే అనేది విశ్లేషకుల మాట. నాగార్జున గత సినిమాలు ఆఫీసర్, మన్మథుడు-2 డిజాస్టర్ అయ్యాయి. వీటికి సరైన ఓపెనింగ్స్ కూడా లేవు. ఇక, ‘వైల్డ్ డాగ్’ గురించి చూస్తే.. ఇది ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా కాదు. యాక్షన్ డ్రామా కాబట్టి.. ఫైట్లు, ఛేజ్ లు ఇష్టపడేవారే టికెట్ కొంటారు. వాళ్లు సినిమా సూపర్ అని చెప్తే తప్ప.. మిగిలిన వారు థియేటర్ బాట పట్టే ఛాన్స్ తక్కువ.
Also Read: వెండితెరపై ‘ఆట’ షురూ.. మోత మోగనున్న థియేటర్లు!
కానీ.. ఓటీటీకి సినిమాను రూ.35 కోట్లకు అమ్మేస్తే.. నిర్మాత అప్పుడు లాభాల్లో ఉంటాడు. అంతేకాదు.. శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ ఎలాగో ఉంటాయి. అవి కూడా లాభాలుగానే మిగులుతాయి. ఈ లెక్కలన్నీ చూసినప్పుడు నెట్‌ఫ్లిక్స్ డీల్ మంచిదే. అయినప్పటికీ.. అవన్నీ కాదనుకొని థియేటర్ వస్తున్నారంటే.. ఇటీవల విడుదలైన క్రాక్, ఉప్పెన కలెక్షన్లు చూసి ఆశపడి ఉంటారు. ఆశపడటంలో తప్పులేదు. కానీ.. అవకాశం ఎంత ఉందన్నదే పాయింట్.
ఓటీటీ నుంచి రూ.35 కోట్ల డీల్ కాదనుకుని థియేటర్ కు వచ్చారు కాబట్టి.. బాక్సాఫీస్ నుంచి ‘వైల్డ్ డాగ్’ 36 కోట్లకుపైగానే షేర్ రాబట్టాలి. అప్పుడే.. ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకున్నందుకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మరి, ఆ స్థాయిలో షేర్ తెచ్చుకోవాలంటే.. కనీసం 50 కోట్ల గ్రాస్ సంపాదించాలి. ఈ సినిమా కథ, కాస్ట్ చూస్తే ఒక జోనర్ కు మాత్రమే పరిమితమైంది. నాగార్జున తప్ప భారీ తారాగణం ఏమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత మొత్తం సాధించడం వైల్డ్ డాగ్ కు సాధ్యమేనా? అన్నది ప్రశ్న.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్