Chiranjeevi Balakrishna: ఇండస్ట్రీ కి సంబంధించి ఏ విషయం గురించి అయినా చర్చించాలంటే ప్రతీ ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi). ఎందుకంటే ఆయన వద్దకు వెళ్తే కచ్చితంగా పని అవుతుంది అనే భరోసా ఉంటుంది కాబట్టి. ఎన్నో పనులు జరిగాయి కూడా. అయితే ఇలాంటి విషయాల్లో నన్ను ఎందుకు పిలవరు అంటూ బాలయ్య(Nandamuri Balakrishna) ఎన్నో సందర్భాల్లో తనలోని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేవాడు. గతం లో కేసీఆర్ ని చిరంజీవి మరియు ఇతర టాలీవుడ్ సెలబ్రిటీలు కలిసినప్పుడు బాలయ్య ఎంతలా విరుచుకుపడ్డాడో మనమంతా చూసాము. నన్ను పిలవలేదు వీళ్ళు,ఏమో వీళ్ళు రహస్యంగా భూములు పంచుకోవడానికి చర్చలు పెట్టుకుంటారేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే రీసెంట్ గానే సీవీ ఆనంద్ IPS పైరసీ గురించి చర్చించడానికి టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు, దర్శకులు మరియు కొన్ని డిజిటల్ మూవీ కంపెనీల అధినేతలను తమ ఆఫీస్ కి ఆహ్వానించి చర్చలు జరిపాడు.
ఈ చర్చల్లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ , దిల్ రాజు, మహేష్ బాబు, నాని, సురేష్ బాబు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. సీనియర్ హీరోల్లో బాలయ్య తప్ప మిగిలిన ముగ్గురు వచ్చారు. ఒక అభిమాని సీవీ ఆనంద్ కి రిప్లై ఇస్తూ ‘మీరు బాలయ్య ని ఎందుకు పిలవలేదు?, మళ్లీ ఆయన ఈ విషయం పై అసెంబ్లీ లో గర్జిస్తాడు’ అని అంటాడు. దీనికి సీవీ ఆనంద్ వెటకారంగా నవ్వడం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టీ బాలయ్య అసెంబ్లీ లో చిరంజీవి పై వ్యంగ్యాస్త్రాలు సంధించడం ఏ రేంజ్ లో బ్యాక్ ఫైర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజు అసెంబ్లీ చిరంజీవి సోదరుడు, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ లో లేడు కాబట్టి సరిపోయింది, ఒకవేళ ఉండుంటే కూటమి ఐక్యత కి దెబ్బ పడేది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హిందూపూర్ MLA సిట్యుయేషన్ ఏంటో ఇప్పుడు pic.twitter.com/49TzFa5R30
— Praveen Reddy (@MPRAVEENREDDY13) November 16, 2025