Venkatesh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆయనకి ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి విపరీతమైన సపోర్ట్ అయితే లభిస్తుంది. అందువల్లే ఆయన చేసిన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమాను చూసి హిట్ చేస్తుంటారు. ఇక దానికి తగ్గట్టుగానే వెంకటేష్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగానే కథలను ఎంచుకొని సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
మరి ఇలాంటి క్రమం లో వెంకటేష్ ఇక ఫ్యామిలీ జానర్స్ లోనే సినిమాలు చేస్తాడు తప్ప మిగతా జానర్స్ లో సినిమాలు ఎందుకు చేయడం లేదని అతని గురించి చాలామంది విమర్శిస్తున్నారు. ఎప్పుడు వెంకటేష్ ఫ్యామిలీ స్క్రిప్ట్ లనే చేస్తున్నారు. అలా కాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు చేయొచ్చు కదా అని వెంకటేష్ అభిమానులు కూడా అతన్ని ప్రశ్నిస్తున్నారు. నిజానికి 35 సంవత్సరాల నుంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ఇలాంటి సమయంలో కొంచెం ప్రయోగాత్మకమైన సినిమాలు చేస్తే జనాల్లో గుర్తుండిపోతాయి కదా అనే వాళ్ళు కూడా ఉన్నారు.
ఈ సందర్భంలో ఆయన ఒక అడ్వెంచర్ జానర్ కి సంబంధించిన స్టోరీ ని ఎంచుకొని సినిమా చేయొచ్చు కదా లేదంటే మలయాళం లో ముమ్ముట్టి చేసే పాత్ర లాంటివైనా వెంకటేష్ కి బాగా సెట్ అవుతాయి కానీ వెంకటేష్ వాటి మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు. ఎంతసేపు కమర్షియల్ సినిమాలను నమ్ముకుంటూ ముందుకు సాగుతున్నాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. నిజానికైతే వెంకటేష్ కి ఉన్న బాడీ కి గానీ, ఆయనకి ఉన్న ఫిట్నెస్ కి గాని , ఆయన డీల్ చేయగలిగే సబ్జెక్టులు చాలానే ఉన్నాయి. అయినప్పటికీ కామెడీ ఎంటైర్ టైనర్స్ ను మాత్రమే ఆయన ప్రిఫర్ చేస్తూ వస్తున్నాడు.
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఇంకొక కామెడీ సినిమా చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన సైంధవ్ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడం తో ఆయన సెక్యూర్ జోన్ లో ఉండే విధంగా కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు…