Pawan Kalyan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఈయన ప్రస్తుతం ఏపి ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నాడు. అయినప్పటికీ తన సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని కూడా తొందరగా కంప్లీట్ చేయాలనే పనిని పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఎలక్షన్స్ క్యాంపెనింగ్ లో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీజర్ కి డబ్బింగ్ చెప్పి దానిని రిలీజ్ చేశారు.
ఇక ఈ టీజర్ మీద కొన్ని కాంట్రవర్సీలు కూడా జరిగాయి. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఇలా సినిమాలు చేస్తేనే తన పార్టీని నడపడానికి తనకి ఫండ్ వస్తుందని ఆయన అలా చేస్తున్నారనే విషయం మనకు తెలిసిందే… ఇక అందులో భాగంగానే ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్ లో ‘ఓజీ’ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాతో పాన్ ఇండియా లో పవన్ కళ్యాణ్ తన మొదటి సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే సుజీత్ ప్రస్తుతం తనకంటూ ఒక యూనివర్స్ ను క్రియేట్ చేసుకొని దాని కింద సినిమాలను చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే లోకేష్ కనకరాజు లోకేష్ యూనివర్స్ అంటూ తన సినిమాలన్నింటికీ ఇంటర్ లింక్ గా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఓజి సినిమా నుంచి సుజీత్ కూడా తన సినిమాలు అన్నింటికి ఇంటర్ లింక్ చేసే విధంగా కథలను రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక వీళ్ళందర్నీ ఒకానొక టైంలో కలిపి తన యూనివర్స్ స్టామినా యేంటో చూపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సుజీత్ నానితో ఒక డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు. చూడాలి మరి సుజీత్ ఏ మేరకు తన యూనివర్స్ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడు అనేది…