https://oktelugu.com/

Balayya: బాలయ్యకు ఎందుకు అంత క్రేజ్ అంటే.. ?

Balayya: బాలయ్య బాబుకు ఎందుకు అంత క్రేజ్ ? అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ ప్రశ్నకు తమకు తోచింది చెప్పుకుంటూ పోతున్నారు జర్నలిస్ట్ లు, నెటిజన్లు. నిజానికి క్రేజ్ అనేది అందరికీ ఉండదు. డిమాండ్ ఉండొచ్చు, క్రేజ్ అనేది కొందరికి మాత్రమే దక్కే అదృష్టం. సహజంగా డిమాండ్ నే క్రేజ్ గా భావిస్తూ ఉంటారు. అయితే, క్రేజ్ వేరు.. డిమాండ్ వేరు. వరుసగా హిట్లు వస్తే.. డిమాండ్ పెరుగుతుంది. అదే […]

Written By:
  • Shiva
  • , Updated On : December 7, 2021 / 03:48 PM IST
    Follow us on

    Balayya: బాలయ్య బాబుకు ఎందుకు అంత క్రేజ్ ? అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఆ ప్రశ్నకు తమకు తోచింది చెప్పుకుంటూ పోతున్నారు జర్నలిస్ట్ లు, నెటిజన్లు. నిజానికి క్రేజ్ అనేది అందరికీ ఉండదు. డిమాండ్ ఉండొచ్చు, క్రేజ్ అనేది కొందరికి మాత్రమే దక్కే అదృష్టం. సహజంగా డిమాండ్ నే క్రేజ్ గా భావిస్తూ ఉంటారు. అయితే, క్రేజ్ వేరు.. డిమాండ్ వేరు.

    Balayya

    వరుసగా హిట్లు వస్తే.. డిమాండ్ పెరుగుతుంది. అదే వరుసగా ప్లాప్ లు వచ్చినా క్రేజ్ మాత్రం తగ్గదు. అదే క్రేజ్ కి, డిమాండ్ కి ఉన్న తేడా. పాత తరంలో ఎన్టీఆర్ కి క్రేజ్ ఉండేది. ఏఎన్నార్ కి డిమాండ్ ఉండేది. కృష్ణకు డిమాండ్ ఉండేది, శోభన్ బాబుకు క్రేజ్ ఉండేది. ఆ తర్వాత తరంలో చిరంజీవికి డిమాండ్ ఉండేది. బాలయ్య బాబుకు క్రేజ్ ఉండేది.
    ఒక హీరో మీద కావొచ్చు, లేదా కనీసం ఓ వ్యక్తి మీద కావొచ్చు.. క్రేజ్ రావాలి అంటే.. చాలా లెక్కలు ఉన్నాయి. ముందు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం జనానికి నచ్చాలి. అలాగే ఆ వ్యక్తి ప్రత్యేకమైన వ్యక్తి అని అందరూ నమ్మాలి. దీనికి తోడు కొన్ని షరతులు ఉన్నాయి. ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లోనూ తలవంచకూడదు. వరుస ప్లాప్ లు వస్తున్నా.. దేనికీ వెనుదిరగకూడదు.

    స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తే.. హిట్ వస్తోంది అని తెలిసినా.. నచ్చినట్లు, ఇష్టం వచ్చినట్టు అందుబాటులో ఉన్న డైరెక్టర్లతో సినిమాలు చేసే దమ్ము ఉండాలి. ఆ దమ్ముతో సినిమాలు చేసి ఓటమిపాలైనా అసలు ఓడిపోయాం అనే భావనే ఉండకూడదు. అలాగే తనను చూసి.. నలుగురూ నవ్వుకుంటున్నారు అని అర్ధం అయినా.. మనసులోని ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడు కోల్పోకూడదు.

    Also Read: ఆమెను వెలి వేద్దాం.. బ్రదర్ ఏమి చెబితే అదే మా మాట !

    ముఖ్యంగా ఏది చెయ్యాలనిపిస్తే అది చేయాలి. నమ్మిన పనిని నచ్చినట్టు చేసే తెగింపు ఉండాలి. మీరు గమనిస్తే.. బాలకృష్ణలో ఈ లక్షణాలు అన్నీ ఉంటాయి. బాలయ్య బాబుకు విమర్శలు పెద్దగా పట్టవు. తన పద్ధతేదో తనదే. ఇక గెలుపోటములు బాలయ్య క్రేజుని వంగదీయలేవు. అన్నింటికి మించి బాలయ్య ఆలచనలో డ్రామాలు ఉండవు.

    తన మనసులో ఏది అనిపిస్తే అదే బయటకు వస్తోంది. ఇక సేవలోనూ సాయంలోనూ గొప్ప హృదయం ఉండాలి. ఇవ్వన్నీ బాలయ్యలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టే.. బాలయ్యకి క్రేజ్ ఉంది.

    Also Read: Katrina: కత్రినా కారు ఆపిన ట్రాఫిక్​ పోలీస్​.. నెట్టింట్లో వీడియో వైరల్​

    Tags