https://oktelugu.com/

Katrina Kaif Marriage: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ – కత్రీన పెళ్లికి సర్వం సిద్ధం

Katrina Kaif Marriage: పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం లో అడుగు పెడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్. ఈ లవ్ బర్డ్స్ తమ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. వీరి వివాహం రాజస్థాన్‌లో సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో జరగనుంది. నేటి నుండి అంటే మంగళవారం సంగీత్, ఆ మర్నాడు మెహందీ, ఆ తర్వాత 9న విక్కీ–కత్రినాల వివాహం, 10న రిసెప్షన్‌ జరగనున్నాయట.సోమవారం వధూవరుల కుటుంబం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 03:48 PM IST
    Follow us on

    Katrina Kaif Marriage: పెళ్లి అనే మధురమైన జ్ఞాపకం లో అడుగు పెడుతున్నారు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరో విక్కీ కౌశల్. ఈ లవ్ బర్డ్స్ తమ వివాహ వేడుకలను వీలైనంత ఘనంగా జరుపుకోవడానికి సన్నాహాలు చేసుకున్నారు. వీరి వివాహం రాజస్థాన్‌లో సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో జరగనుంది. నేటి నుండి అంటే మంగళవారం సంగీత్, ఆ మర్నాడు మెహందీ, ఆ తర్వాత 9న విక్కీ–కత్రినాల వివాహం, 10న రిసెప్షన్‌ జరగనున్నాయట.సోమవారం వధూవరుల కుటుంబం ఫోర్ట్‌లో చెకిన్‌ అయ్యారు. 11న కోట నుండి చెక్‌ అవుట్‌ అవుతారు‌ అలాగే అతిథుల కోసం కూడా విలాసవంతమైన గదులను బుక్‌ చేశారట.

    ఈ ప్రేమ జంట తమ వివాహానికి భారీగానే బడ్జెట్ ను పెట్టుకున్నారని చెప్పాలి. ఒక్కో గది అద్దె రోజుకి 70 వేల రూపాయలని టాక్‌.ఈ వేడుకలో దాదాపు 120 మంది అతిథిలు ఈ వేడుకల్లో పాల్గొంటారని బాలీవుడ్‌ అంటోంది.అయితే విక్కీకి ‘రాణా మాన్‌సింగ్‌’ పేరున్న సూట్‌ని, కత్రినాకు ‘రాణి పద్మావతి’ పేరున్న సూట్‌ని బుక్‌ చేశారని వినికిడి. విరి ఒక్కో గది అద్దె రోజుకి దాదాపు 7 లక్షల రూపాయలని సమాచారం.

    మరో విశేషం ఏమిటంటే ఈ వివాహానికి కత్రినా మాజీ ప్రేమికులు సల్మాన్‌ ఖాన్, రణ్‌బీర్‌ కపూర్‌ పేర్లు ఉన్నాయా లేవా అసలు వీరికి ఆహ్వానాలు వెళ్లాయా? అనే చర్చ బాలీవుడ్‌లో జరుగుతోంది. చూడాలి మరి అతిథులుగా వీరి పెళ్లిలో బాలీవుడ్ స్టార్స్ ఎవరు ఆహ్వానితులుగా పాల్గొంటున్నారు అనేది.