Telugu Directors Fadeout Reasons: సినిమా ఇండస్ట్రీలో ఒక్క సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన వాళ్ళు ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్లుగా మారిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే కొంతమంది మాత్రం కంటిన్యూస్ గా సక్సెస్ లను సాధిస్తున్నప్పటికి వాళ్ళు ఒకే స్ట్రెచర్ మైంటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మధ్యలో కొంతమంది స్టార్లు డైరెక్టర్లుగా మారి మళ్ళీ ఆ తర్వాత సరైన సక్సెస్ లేక డీలా పడిపోతున్నారు. ప్రస్తుతం కొంతమంది దర్శకులు ఫెడౌట్ దశకు దగ్గరలో ఉన్నారు… అందులో మొదటి స్థానంలో హరీష్ శంకర్ ఉన్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దాంతో ఆయన మరోసారి డీలా పడిపోయాడు.
ఆయన రవితేజ తో చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా సైతం అతనిని తీవ్రంగా నిరాశ పరచడంతో ఇప్పుడు హరీష్ శంకర్ పరిస్థితి ఏంటి ఆయనకు అవకాశాలు ఇచ్చే హీరోలు ఎవరు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అలాగే ఆయన చాలా వరకు డీలాపడిపోయాడు. తన మార్కెట్ ను సైతం కోల్పోయాడు. కాబట్టి ఇక తను ఫెడౌట్ దశకు దగ్గరలో ఉన్నాడు. మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…
ఇక బోయపాటి శ్రీను పరిస్థితి కూడా అదే మాదిరిగా ఉంది. అఖండ 2 సినిమాతో భారీ డిజాస్టర్ ను మూట గట్టుకున్న ఆయన రొటీన్ సినిమాలను చేస్తాడనే ఒక ముద్రనైతే వేసుకున్నాడు. అయినప్పటికి తను ఎప్పటికప్పుడు బాలయ్య బాబుతో సినిమాలను చేసి భారీ సక్సెస్ లను సాధిస్తూ వచ్చాడు.
కానీ బాలయ్యతో చేసిన ‘అఖండ 2’ సినిమా కూడా డిజాస్టర్ గా మారడంతో ఆయన కూడా ఫేడౌట్ దశకు చాలా దగ్గరలో ఉన్నాడంటూ కొన్ని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి. ఇక వీళ్ళందరు వాళ్ళ పంథాను మార్చుకొని కొత్త స్టైల్లో ముందుకు సాగితేనే సక్సెస్ లు వస్తాయి. లేకపోతే మాత్రం భారీ డిజాస్టర్లు రావడమే కాకుండా వాళ్ళ మార్కెట్ ను కోల్పోయి వాళ్ళకి అవకాశాలను ఇచ్చే హీరోలు కూడా కరువైపోతారు…