https://oktelugu.com/

Devi Sri Prasad : దేవి శ్రీ ప్రసాద్ కంటే తమన్ కే ఎందుకు ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న హీరోలు చాలామంది ఉన్నారు.

Written By: , Updated On : December 14, 2024 / 02:40 PM IST
Devi Sri Prasad

Devi Sri Prasad

Follow us on

Devi Sri Prasad : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్న హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సినిమా దర్శకుడితో పాటు ఆ సినిమాకు మ్యూజిక్ ని అందించే మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా హానెస్ట్ గా మ్యూజిక్ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఆయన ఎంత మంచి మ్యూజిక్ ని అందిస్తాడో సినిమా ఆ రేంజ్ లో ప్రేక్షకులకు రీచ్ అవుతుందనే చెప్పాలి…అందువల్లే ప్రస్తుతం ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్లకి చాలా మంచి గిరాకీ అయితే ఉంది…

ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో చాలామంది దర్శకులు వాళ్లకు అనుకూలంగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్లకి ఎక్కువగా అవకాశాలను ఇస్తున్నారు అంటే ఒక సాంగ్ అనుకున్న సమయంలో ఇచ్చి సినిమాకు సంబంధించిన బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా అనుకున్న టైం కి ఇవ్వగలిగే కెపాసిటి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లకి ఎక్కువ అవకాశాలను ఇస్తున్నారు. వాళ్ళు మ్యూజిక్ తో పెద్దగా సత్తా చాటక పోయిన పర్లేదు. కానీ వాళ్లకు అనుకూలంగా ఉండే మ్యూజిక్ డైరెక్టర్లను ఎంచుకుంటున్నారు. ఇక దానికి కారణం ఏంటి అంటే ఈ మధ్యకాలంలో వస్తున్న చాలా సినిమాల్లో సాంగ్స్ కాపీ అంటూ ప్రేక్షకులు తేల్చేస్తున్నారు. కొత్తగా ఫ్రెష్ మ్యూజిక్ ను ఎవ్వరు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి కాపీ అయినా కూడా తమ సినిమాకి సాంగ్ అనేది సెట్ అయిందా లేదా అనే దీనినే దర్శకులు ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఈ క్రమంలోనే మంచి మ్యూజిక్ ను ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టి తమన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ కి ఎక్కువ అవకాశాలను ఇస్తున్నారు. కారణం ఏంటంటే తమన్ తక్కువ సమయంలోనే మ్యూజిక్ చేస్తాడు. అలాగే ఆతన ఇచ్చిన మ్యూజిక్ కాపీ అని తెలిసిన కూడా సినిమాకి మాత్రం మంచి బజ్ అయితే క్రియేట్ అవుతూ ఉంటుంది. దానివల్లే దేవిశ్రీప్రసాద్ తో పోలిస్తే తమన్ కి ఎక్కువ అవకాశలైతే వస్తున్నాయి.

మరి ఈ రకంగా కూడా డైరెక్టర్లు ఆలోచిస్తూ వాళ్లకి అవకాశాలను ఇస్తూ ఉండటం అనేది నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఇక ఈ మధ్యకాలంలో తమన్ మ్యూజిక్ అందించిన సినిమాలేవీ పెద్దగా మ్యూజికల్ గా హిట్లైతే సాధించలేదు. ఇక దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ లో కూడా క్వాలిటీ అయితే తగ్గింది.

కానీ తమన్ తో పోల్చుకుంటే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ లో కొంతవరకు క్వాలిటీ అయితే ఉంటుంది. అయినప్పటికీ ఆయనను పక్కనపెట్టి తమన్ కి ఎక్కువ అవకాశాలను ఇస్తున్నారు. ఇక తమన్ కి ఎక్కువ అవకాశాలు ఇవ్వడానికి మరొక కారణం ఏంటంటే ఆయన తీసుకునే రెమ్యూనరేషన్ కూడా దేవిశ్రీప్రసాద్ కంటే తక్కువగానే ఉంటుంది.

అందువల్ల దర్శకులు ఇలాంటి విషయాలను కూడా కాలిక్యూలేట్ చేసుకుంటూ దేవిశ్రీప్రసాద్ కంటే తమన్ బెస్ట్ అని ఆయననే తీసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం వచ్చిన అవకాశాలను కూడా చేజార్చుకుంటూ ఉన్న సినిమాలకే మంచి మ్యూజిక్ ని ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…