HHVM Jyothi Krishna Interview: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే ఎలాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అభిమానులు ఈ చిత్రం సెకండ్ హాఫ్ కి తీవ్ర స్థాయిలో నిరాశకు గురయ్యారు. ఇక రివ్యూయర్స్ అయితే ఈమధ్య కాలం లో ఏ చిత్రానికి ఇవ్వనంత దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు. కొన్ని ప్రముఖ మీడియా చానెల్స్ అయితే 1 రేటింగ్స్ కూడా ఇచ్చాయి. వీటి ప్రభావం ఈ చిత్రం పై మామూలు రేంజ్ లో పడలేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండే 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు, రెండవ రోజు కేవలం మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు, టాక్ ఎంత చెత్తగా ఉంది అనేది. కానీ నిన్న ఈ చిత్రానికి అన్ని ప్రాంతాల్లోనూ వసూళ్లు అద్భుతంగా వచ్చాయి.
Also Read: మెగాస్టార్ చిరంజీవి ఎత్తుకున్న ఈ బుడ్డోడు ఎవరో గుర్తుపట్టారా..?
ప్రీమియర్స్ + మొదటి రోజు తర్వాత నిన్న ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన రోజు గా గుర్తించవచ్చు. నేడు ఎలాగో మార్నింగ్ షోస్ క్రాష్ అయ్యాయి అనుకోండి, అది వేరే విషయం. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జ్యోతి కృష్ణ(Jyothi Krishna) రీసెంట్ గానే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందుగా ఈ చిత్రం డైరెక్టర్ క్రిష్(Krish Jagarlamudi) తో మొదలైంది. ఆయన 50 శాతం కి పైగా సినిమాని తెరకెక్కించిన తర్వాత పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమా నుండి తప్పుకొని, మరో సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. అయితే డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడం పై జ్యోతి కృష్ణ ఈ ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: బాలీవుడ్ లో తగ్గని ‘పుష్ప’ మేనియా.. ఈ వీడియోనే ఫ్రూఫ్
ఆయన మాట్లాడుతూ ‘డైరెక్టర్ క్రిష్ గారు అనుకున్న స్టోరీ వేరే. ఆయన కేవలం కోహినూర్ డైమండ్ ని ఔరంగజేబు నుండి ఎలా తీసుకొని రావాలి అనే లైన్ పై, ఎంటర్టైన్మెంట్ తో రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ఎలా సాగిందో, అదే లైన్ లో సాగేది. కానీ ఆయన వెళ్లిపోయిన తర్వాత, ఆయన రాసుకున్న స్క్రిప్ట్ ని డీల్ చేయడం చాలా పెద్ద సాహసం. సమయం చాలా పడుతుంది. మాకు అంత సమయం లేదు కాబట్టి, ఈ విధంగా స్టోరీ లైన్ ని రాసుకొని తీశాము. క్రిష్ గారు రాసుకున్న స్టోరీ రెండవ భాగం లో ఉంటుంది. ఆయన తనకి ఉన్న కమిట్మెంట్స్ కారణంగానే ఈ చిత్రం ఆలస్యం అవ్వడంతో వైదొలిగాడు, అంతే కానీ, అతనితో మాకు ఎలాంటి విబేధాలు లేవు’ అంటూ చెప్పుకొచ్చాడు జ్యోతి కృష్ణ.