
పింక్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర్నుంచి అందరికీ ఒక్కటే డౌట్. న్యాయం చుట్టూ తిరిగే కథను.. పవన్ చుట్టూ తిప్పుతున్నారని విమర్శలు వచ్చాయి. అవకాశం లేని సినిమాలో స్టార్ డమ్ ను ఇరికిస్తున్నారని అన్నారు. ఇంకా.. ఏవేవో మాట్లాడారు. కానీ.. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ల అభిప్రాయం ఖచ్చితంగా మారి ఉంటుంది.
ఈ ట్రైలర్ మొత్తం న్యాయం కోసం పోరాడుతున్న ఆ ముగ్గురు యువతుల చుట్టూనే తిరిగింది. ఒకటీ రెండు చోట్ల పవన్ యాక్షన్ కనిపించినా.. అది కూడా న్యాయం దక్కకుండా చేసేవారిపై దాడిగానే కనిపించింది. మొత్తంగా.. పింక్ ఆత్మ దెబ్బతినకుండా సినిమాను అల్లుకున్నానని చెప్పిన దర్శకుడి మాటలు నిజమేనని స్పష్టమైంది.
పింక్ మూలాన్ని కొనసాగిస్తూనే.. పవన్ ఇమేజ్ ను పెంచే సన్నివేశాలు రాసుకున్నట్టు చెప్పారు దర్శకుడు శ్రీరామ్ వేణు. ట్రైలర్ చూసిన తర్వాత అదే నిజమని అనిపించింది. దీనికి సాక్ష్యంగా మరో విషయం కూడా నిలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా ఉన్న శృతిహాసన్ కు అసలు చోటే ఇవ్వలేదు.
అది వకీల్ సాబ్ వ్యక్తిగత జీవితం కాబట్టి.. ఉద్దేశపూర్వకంగానే ట్రైలర్ లో శృతిని దాచేశారనే చర్చ నడుస్తోంది. ఆమెకు ట్రైలర్ లో అవకాశం ఇవ్వకపోవడం వ్యూహాత్మకమేనని, అది కూడా మంచిదేనని అంటున్నారు. ట్రైలర్ మొత్తం కోర్టు చుట్టూనే తిరగడం ద్వారా.. ఎమోషన్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లింది ట్రైలర్. ఈ విషయాన్ని అందరికీ అర్థం చేయించేందుకే శృతిని దాచ్చేశారని అంటున్నారు.