
టాలీవుడ్ లో ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ది నెంబర్ వన్ పొజిషన్ అని వకీల్ సాబ్ ట్రైలర్ తో తేలిపోయింది. మొత్తానికి ‘వకీల్ సాబ్’ సినిమా విడుదల కాకముందే, సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా ట్రైలర్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతుందని ప్రకటించిన దగ్గర నుండి, పవన్ ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్న నేరుగా థియేటర్లలో ట్రైలర్ వదిలింది. కానీ మొత్తం ఇండస్ట్రీనే షాక్ అయ్యేలా ఈ ట్రైలర్ స్పందన ఉంది.
దాదాపు మూడేళ్ళ తరవాత పవన్ వెండి తెర మీద కనిపించడంతో అభిమానులు ఆ ఆనందంలో లైక్స్ అండ్ షేర్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసి పడేసారు. అలాగే అభిమానులు చేసిన హంగామా దెబ్బకు కొన్ని చోట్ల అయితే థియేటర్లు కూడా డ్యామేజ్ అయ్యాయట. ఏది అయితే ఏం మొత్తానికి మిగతా స్టార్ హీరోలు నెలకొల్పోన పాత రికార్డులన్నీ తిరగరాసేలా ఉన్నాడు పవన్. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ కి కేవలం 24 గంటల్లో లైక్స్ మిలియన్ మార్క్ క్రాస్ చేయాలని టార్గెట్ పెట్టుకుని దాన్ని సాధించారు పవన్ ఫ్యాన్స్.
మొదట కేవలం 5 గంటల్లోనే హాఫ్ మిలియన్ లైక్స్ రాబట్టుకున్న ఈ ట్రైలర్, ఈ సాయంత్రం 5 గంటల వరకు 9.87 లక్షల లైక్స్ సాధించి.. ఓవరాల్ గా 24 గంటలు పూర్తయ్యేసరికి అనగా సాయంత్రం 6 గంటల్లో మిలియన్ లైక్స్ మార్కును అందుకుని కొత్త రికార్డ్ ను సృష్టించింది. ఫైనల్ గా ‘టాలీవుడ్ మోస్ట్ లైక్డ్ టీజర్ ఇన్ 24 అవర్స్’ అనే రికార్డును మొత్తానికి పవన్ తన పేరిట లికించుకున్నాడు. ఇక టాలీవుడ్ నెంబర్ వన్ ‘పవర్ స్టారే’.. ఇదే రుజువు.
నిజానికి ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడని ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా భారీ హోప్స్ పెట్టుకున్నారు. మరి ట్రైలర్ సక్సెస్ రేంజ్ ను చూస్తే.. ఆ అంచనాలను చాల ఈజీగా ఈ సినిమా అందుకునేలా ఉంది. ఎంతైనా పవర్ స్టార్ రీఎంట్రీ సినిమా కదా.. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కూడా టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ను తిరగరాయడం గ్యారంటీ.