Salman Khan : సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ హీరో ఎంతో మంది అభిమానులను సంపాదించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒకసారి ఈయన సినిమా వస్తుందంటే చాలు ఎంతో మంది వెయిట్ చేస్తుంటారు. సినిమా రిలీజ్ అవగానే బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్లు కూడా కలెక్ట్ చేస్తాయి ఈయన సినిమాలు. కొన్ని సినిమాలు ఫ్లాప్ లను కూడా అందుకుంటాయి. కానీ హిట్లే ఎక్కువ. మొత్తం మీద బాయ్ జాన్ వస్తున్నాడంటే బాద్ షా అభిమానులు కూడా ఎదురు చూడటం కామన్.
మరి ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ స్టార్ హీరో ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎన్నో హిట్ సినిమాలు ఉన్నా సరే పర్సనల్ లైఫ్ లో మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు ఈ స్టార్ హీరో. మరి ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదు అని చాలా మంది అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. మరి మీకు కూడా తెలుసుకోవాలి అని ఉందా? అయితే ఈ ఆర్టికల్ ను ఓ సారి చదివేసేయండి.
ఈ రోజు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు. డిసెంబర్ 27న 59వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు సల్మాన్ ఖాన్. వచ్చే సంవత్సరం 60లో అడుగుపెట్టే ఈ స్టార్ హీరో బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ గా ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. మరి ఇలా సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగా ఉండటానికి కారణం మాత్రం ఉందట. 59 ఏళ్ల సల్మాన్ ఖాన్ బ్రహ్మచారిగానే ఉండటం ఆయన అభిమానులను కలచి వేస్తుంది. బాలీవుడ్ సూపర్ స్టార్, అందమైన హీరోకు ఇప్పటికే చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉండేవారు. కానీ ఎవరిని ఈయన ఇంకా పెళ్లి చేసుకోలేదు.
సంగీత బిజ్లానీతో నిశ్చితార్థం కూడా జరిగిన విషయం తెలిసిందే. సల్మాన్ జీవితంలోకి చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ వచ్చారు వెళ్లారు. కానీ ఎవరు పెళ్లి చేసుకొని తనతో ఉండలేకపోయారు. అయితే కేవలం సంగీత బిజ్లానీతో మాత్రమే నిశ్చితార్థం వరకు వెళ్లారు. కానీ తర్వాత వారి వివాహం కూడా క్యాన్సల్ అయింది.
ఒక ఇంటర్వ్యూలో సల్మాన్ తండ్రి సలీం ఖాన్ తన కొడుకు గురించి తెలిపారు. పెళ్లి చేసుకోవడానికి తన కొడుకుకు ధైర్యం చాలడం లేదని కుండబద్దలు కొట్టారు. ఇక తనకు అమ్మలాంటి భార్య కావాలి అని కోరుకున్నారట. అయితే సల్మాన్ ఖాన్ గర్ల్‌ఫ్రెండ్‌లో తన తల్లిలాంటి వ్యక్తిని చూడాలనుకుంటున్నారు. ఈ కండిషన్ లను గర్ల్ ఫ్రెండ్స్ కు పెట్టడంతో వారు దూరం అయ్యారట. అంతే కాదు నాన్నను వదిలి వెళ్లలేను అంటారు సల్మాన్ ఖాన్. పెళ్లి చేసుకుంటే తండ్రి సలీం ఖాన్ కి దూరం కావాల్సి వస్తుందని కూడా పెళ్లి చేసుకోవడం లేదట.
సల్మాన్ ఖాన్ తన మాజీ ప్రేయసి ఐశ్వర్య రాయ్ ని మరచిపోలేకపోతున్నారు అనే టాక్ కూడా ఉంది. అందుకే పెళ్లి చేసుకోవడం లేదు అని కూడా టాక్. సింగిల్‌గా ఉండటం తాను చేసిన అతిపెద్ద మిస్టేక్ అంటూ సల్మాన్ ఖాన్ చాలా సార్లు చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఇప్పటికీ కూడా సల్మాన్ ఖాన్ సింగిల్ గానే ఉండిపోయారు