https://oktelugu.com/

Devara Movie : జపాన్ లో ‘దేవర’ క్రేజ్ ఈ రేంజ్ లో ఉందా..? ‘రంగస్థలం’ జపాన్ క్లోజింగ్ కలెక్షన్స్ ని దేవర దాటేస్తుందా!

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున జపాన్ మొత్తం గ్రాండ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ జపాన్ రిలీజ్ ని మూవీ టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం.

Written By:
  • Vicky
  • , Updated On : December 27, 2024 / 09:37 PM IST

    Devara Movie In Japan

    Follow us on

    Devara Movie :  బాహుబలి సిరీస్ తర్వాత మన టాలీవుడ్ సినిమాలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. #RRR చిత్రం తో ఆ గుర్తింపు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా చైనా దేశం లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ సలార్ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేస్తే దాదాపుగా 30 మిలియన్ జపనీస్ డాలర్స్ ని వసూలు చేసింది. అదే విధంగా గత ఏడాది రామ్ చరణ్ రంగస్థలం చిత్రాన్ని భారీ లెవెల్ లో విడుదల చేస్తే దాదాపుగా 45 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. #RRR చిత్రం తర్వాత అత్యధిక వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమా ఇదే. ఇప్పుడు ఈ రికార్డు ని బద్దలు కొట్టేందుకు ఎన్టీఆర్ దేవర చిత్రం సిద్ధంగా ఉంది.

    ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28 వ తారీఖున జపాన్ మొత్తం గ్రాండ్ గా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. ఈ జపాన్ రిలీజ్ ని మూవీ టీం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. #RRR చిత్రానికి ఏ విధంగా అయితే మూవీ టీం మొత్తం కలిసి జపాన్ లో ప్రొమోషన్స్ చేసారో, ఈ చిత్రానికి కూడా ఆ రేంజ్ ప్రొమోషన్స్ ని ప్లాన్ చేశారట. ఎన్టీఆర్ సుమారుగా నెల రోజుల పాటు నాన్ స్టాప్ గా ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తుంది. ఈ రేంజ్ ప్రొమోషన్స్ చేస్తే ఈ చిత్రం ‘రంగస్థలం’ ని మాత్రమే కాదు, #RRR ని కూడా దాటేస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎన్టీఆర్ #RRR కి ముందు నుండే జపాన్ లో మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన బాద్షా చిత్రం ఇక్కడ విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది.

    అయితే మధ్యలో యమదొంగ, సింహాద్రి వంటి చిత్రాలను అక్కడ రిలీజ్ చేసారు కానీ, వాటికి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ప్రభాస్ కల్కి చిత్రం జపాన్ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. కానీ రెస్పాన్స్ మాత్రం అంతంత మాత్రం గానే వచ్చింది. వాస్తవానికి మూవీ టీం పెద్ద ఎత్తున ప్రొమోషన్స్ చేయాలని అనుకుంది. కానీ ప్రభాస్ కాళ్లకు గాయం అవ్వడం వల్ల జపాన్ కి వెళ్లలేకపోయాడు. దీంతో ప్రొమోషన్స్ ప్లాన్స్ మొత్తం అట్టకెక్కింది. ఒకవేళ ఈ చిత్రానికి ప్రొమోషన్స్ సరైన రీతిలో చేసి విడుదల చేసుంటే పెద్ద హిట్ అయ్యేందని ట్రేడ్ పండితుల అభిప్రాయం. చూడాలి మరి భవిష్యత్తులో ‘దేవర’ చిత్రానికి ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుంది అనేది. ఇకపోతే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘వార్ 2 ‘ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.