Jr NTR War 2 Role: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ‘త్రిబుల్ ఆర్’ (RRR), దేవర సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టిన ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ బరిలోకి దిగుతున్నాడు. ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేసిన ఆయన ఇప్పుడు వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి మరోసారి మల్టీ స్టారర్ సినిమాని చేశాడు. ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ పాత్రను పోలి ఉంటుంది. అయినప్పటికి ఆయన ఈ పాత్రను చేయడానికి గల కారణం ఏంటి అంటే ఇతర హీరోలతో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ కి పాన్ ఇండియాలో చాలా తక్కువ మార్కెట్ అయితే ఉంది. దేవర సినిమాతో కేవలం 500 కోట్ల కలెక్షన్స్ కొల్ల గొట్టిన ఆయన ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ఉద్దేశ్యంతోనే వార్ 2 సినిమాలో నటించినట్లుగా తెలుస్తోంది. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులను సైతం మెప్పించడానికి ఆయన విలన్ పాత్రలైన సరే చేసి మెప్పిస్తానని ఒక దృఢ సంకల్పంతో ఈ టాస్క్ ని ఒప్పుకున్నాడు. మరి నటనపరంగా ఆయన ఓకే అనిపించినప్పటికి సినిమాలో ఆయన పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడం, తను చేసిన క్యారెక్టర్ కి పెద్దగా ఎమోషన్ వర్కౌట్ అవ్వకపోవడం వల్ల సినిమా చూసే ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వలేకపోయింది. ఈ సినిమాలో ఆయన నటించి కూడా వృధా అయిపోయింది అంటూ అతని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు…
Also Read: ‘వార్ 2’ లో బాలయ్య పై ఎన్టీఆర్ పరోక్ష సెటైర్లు..థియేటర్ దద్దరిల్లిందిగా!
నిజానికి ఇప్పుడున్న ఇద్దరిలో స్టార్ హీరోలందరు 1000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే, జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంకా 500 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటే కలెక్షన్స్ భారీగా వస్తాయనే ఉద్దేశ్యంతో ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నారట.
ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అవుతున్నప్పటికి ఈ సినిమాతో ఆయనకు వచ్చే ఉపయోగమైతే ఏది లేదని సినీ విమర్శకులు సైతం తేల్చి చెప్పేస్తున్నారు… మరి రాబోయే సినిమాలతో అయిన జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా చాటుకుంటే మంచిదని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఎన్టీఆర్ కి ‘వార్ 2’ బిగ్ అలెర్ట్..ఇకపై ఇలాంటి రోల్స్ చేస్తే ఫ్యాన్స్ దూరం అవుతారా?
ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం పలు రకాల కసరత్తులను చేస్తున్న ఆయన ఇకమీదట ఈ సినిమాతో పాటు రాబోయే సినిమాలను సైతం సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నం చేస్తున్నాడు…