Keeravani Son Career: ఒక సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలంటే దానికి దర్శకుడు యొక్క ప్రతిభతో పాటు ప్రేక్షకులను రంజింపచేసే మ్యూజిక్ కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తోంది. ముఖ్యంగా పాటలతోనే ప్రేక్షకుడిని ఆకట్టుకోగలిగితే ఈజీగా వారు థియేటర్ కి వచ్చి సినిమాని చూస్తారు… అప్పట్లో చాలా సినిమాలు సాంగ్స్ తో మ్యాజిక్ ని చేశాయి. కొన్ని సినిమాలు సాంగ్స్ వల్లే సక్సెస్ ని కూడా సాధించాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈ జనరేషన్ లో ఉన్న చాలా మంది సంగీత దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కీరవాణి ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడో మనందరికీ తెలిసిందే.
Also Read: ‘మిరాయ్’ ప్రొమోషన్స్ కి మంచు మనోజ్ దూరం..? కారణం ఏమిటంటే!
మరి తన కొడుకు అయిన కాల భైరవ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పలు సినిమాలకు సంగీతాన్ని అందించి మంచి విజయాలను అందుకున్నాడు. ముఖ్యంగా కలర్ ఫోటో సినిమాతో అతనికి మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపైతే వచ్చింది. ఇక ఆ తర్వాత మత్తు వదలరా, దానికి సీక్వెల్ గా వచ్చిన మత్తు వదలరా 2 సినిమాలకు కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం…
ఇక ఆయన ఎన్ని సినిమాలు చేసిన కూడా తన తండ్రి మాదిరిగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గా మాత్రం ఎదగలేకపోతున్నాడు. కారణం ఏంటి అంటే అతనికి పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయనిచ్చే మ్యూజిక్ లో కొన్ని సాంగ్స్ మాత్రమే అద్భుతంగా ఉంటున్నాయి.అలా కాకుండా ఆల్బమ్ హిట్ చేసినప్పుడు మాత్రమే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read: రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ ను జరుపుకున్న అఖండ 2…
ఇప్పటివరకు ఈయన చేసిన సినిమాల్లో ఒక్క సినిమా ఆల్బమ్ కూడా సూపర్ సక్సెస్ ని సాధించలేదు. ప్రతి సినిమాలో ఒకటి రెండు పాటలు మాత్రమే సినిమాకి హైప్ ని ఇస్తూ ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ ని క్రియేట్ చేయగలాగుతున్నాయి. కానీ ఆయన్ని టాప్ లోకి మాత్రం తీసుకురాలేకపోతున్నాయి. అందువల్లే ఆయన ఇప్పటికి ఇంకా చిన్న మ్యూజిక్ డైరెక్టర్ గానే కొనసాగుతున్నాడు… చూడాలి మరి ఇక మీదట అయిన తను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది…