Manchu Manoj Mirai Movie Promotions: ‘హనుమాన్’ వంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజ సజ్జ(Teja Sajja) హీరో గా నటించిన చిత్రం ‘మిరాయ్'(Mirai Movie). కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ గ్రాండ్ గా నిర్మించింది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. ముఖ్యంగా టీజర్ లో విజువల్స్ క్వాలిటీ ని చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. చూస్తుంటే తేజ సజ్జ మరో పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడని ఈ టీజర్ ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు అనుకున్నారు. హనుమాన్ లాగానే ఈ చిత్రం కూడా సూపర్ హీరో జానర్ లో తెరకెక్కింది. ఇందులో సూపర్ విలన్ గా మంచు మనోజ్ నటించాడు. చాలా కాలం నుండి సినిమాలకు దూరం ఉంటూ వస్తున్న మనోజ్(Manchu Manoj), రీ ఎంట్రీ ఇస్తూ మొదట ఈ సినిమాకే సంతకం చేశాడు.
Also Read: రజినీకాంత్ – కమల్ హాసన్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయిందా..? పట్టాలెక్కేది ఎప్పుడంటే..?
కానీ ఆ చిత్రం కంటే ముందు ఆయన బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి నటించిన ‘భైరవం’ చిత్రం విడుదలైంది. ఈ సినిమా ఆయనకు అంత గొప్ప పేరు తెచ్చిపెట్టలేదు కానీ, మిరాయ్ మాత్రం క్లిక్ అయితే పాన్ ఇండియా లెవెల్ లో మనోజ్ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే టీజర్ చూస్తుంటే ఆయన క్యారక్టర్ హీరో క్యారక్టర్ కంటే చాలా పవర్ ఫుల్ గా అనిపిస్తుంది. సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ ఇప్పటికే మొదలైంది. తేజ సజ్జ ఇంటర్వ్యూస్ ఇవ్వడం మొదలు పెట్టాడు. పలు టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా కనిపిస్తున్నాడు. చూస్తుంటే ప్రొమోషన్స్ మొత్తం ఆయన తన భుజాల మీద వేసుకొని ముందుకు నడిపించేలా అనిపిస్తున్నాడు.
కానీ మంచు మనోజ్ మాత్రం ఇప్పటి వరకు ప్రొమోషన్స్ ని మొదలు పెట్టాడు. ‘భైరవం’ చిత్రానికి ఆయన ఏ రేంజ్ లో ప్రొమోషన్స్ చేసాడో మనమంతా చూశాము. ఎక్కడ చూసిన మనోజ్ నే కనిపించేవాడు. కానీ ఈ సినిమాకు మాత్రం ఆయన ఎందుకు మౌనం వహిస్తున్నాడో అర్థం కావడం లేదు. వాస్తవానికి చెప్పుకోవాలంటే ఈ చిత్రం భారీ బడ్జెట్ తో ఎంతో లావిష్ గా తెరకెక్కింది. ఆయన కెరీర్ ని మలుపు తిప్పే చిత్రమిది. అలాంటి సినిమాని ఎందుకు పట్టించుకోవడం లేదు?, సినిమాలో తన క్యారక్టర్ పై మంచు మనోజ్ సంతృప్తి గా లేడా?, లేకపోతే మూవీ టీం తో ఆయనకు ఏమైనా గొడవలు జరిగాయా?, ఇవి రెండు కాకుండా మనోజ్ ప్రొమోషన్స్ లో పాల్గొనడానికి కొంత సమయం మూవీ టీం ని కోరుకున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.