https://oktelugu.com/

Rashmika Mandanna: రష్మిక మందాన బోల్డ్ ప్రైవేట్ ఫోటో వైరల్… తన ప్రమేయం లేకుండానే!

రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక రోల్ చేస్తున్నాడు. బాబీ డియోల్ విలన్ గా నటించడం విశేషం. యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ ఎమోషన్, రొమాన్స్ ఓ రేంజ్ లో దట్టించాడు.

Written By:
  • Shiva
  • , Updated On : October 18, 2023 / 10:24 AM IST
    Follow us on

    Rashmika Mandanna: అనతి కాలంలో ఎదిగిన కన్నడ బ్యూటీ రష్మిక మందాన అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో భారీ చిత్రాలు చేస్తుంది. నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక జోరు మామూలుగా లేదు. త్వరలో యానిమల్ మూవీతో ప్రేక్షకులను పలకరించనుంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్ర దర్శకుడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ చిత్ర విజయాలతో క్రేజీ డైరెక్టర్ గా అవతరించాడు. ఆయన ఈసారి గ్యాంగ్ స్టర్ డ్రామా ఎంచుకున్నారు.

    రన్బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో అనిల్ కపూర్ కీలక రోల్ చేస్తున్నాడు. బాబీ డియోల్ విలన్ గా నటించడం విశేషం. యాక్షన్ ఫిల్మ్ అయినప్పటికీ ఎమోషన్, రొమాన్స్ ఓ రేంజ్ లో దట్టించాడు. రష్మికతో లిప్ లాస్ సన్నివేశాలు లెక్కకు మించి ఉన్నాయి. ఎమోషన్స్ లోతుగా చెప్పాలని భావించే సందీప్ రెడ్డి అదే తరహా సన్నివేశాలు రాసుకుంటాడు.

    ఈ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించేందుకు రష్మిక రెమ్యునరేషన్ కి అదనంగా తీసుకుందని సమాచారం. నిర్మాతలకు కేవలం లిప్ లాక్ సీన్స్ కోసం ఎక్స్ట్రా రూ. 20 లక్షలు ఇచ్చారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. యానిమల్ డిసెంబర్ 1న విడుదల కానుంది. హిందీలో భారీ హిట్ కొట్టాలన్న ఆమె కల యానిమల్ తో నెరవేరుతుందని భావిస్తుంది. అలాగే రష్మిక ఖాతాలో ఉన్న మరో భారీ చిత్రం పుష్ప 2. ఇది చిత్రీకరణ జరుపుకుంటుంది.

    దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మరోసారి బీభత్సం చేయనున్నాడు. ఇదిలా ఉంటే ఆమె బోల్డ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. స్లీవ్ లెస్ బాడీ కాన్ డ్రెస్ ధరించి రష్మిక సూపర్ హాట్ గా ఉంది. ఈ ఫోటోను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. దానికి ఆసక్తికర కామెంట్ జోడించింది. ఏడాది క్రితం ఆమె ప్రమేయం లేకుండా ఆ ఫోటో తీశామని, ఇప్పుడు కూడా ఆమెను అడగకుండా చొరవతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నామని, కామెంట్ చేసింది.