https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్… భోలే బూతులు, ప్రియాంక, శోభా చురకలు… నామినేషన్స్ లో ఆ 7గురు!

ఏదో ఫ్లోలో వచ్చాయే నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదన్నాడు. పక్కనే ఉన్న ప్రియాంక కూడా భోలే మీద ఫైర్ అయ్యింది. నువ్వు ఆగు అంటూ... ప్రియాంకతో అన్నాడు.

Written By:
  • Shiva
  • , Updated On : October 18, 2023 / 10:28 AM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: సోమవారం మొదలైన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. శోభా శెట్టి… భోలే, టేస్టీ తేజాలను నామినేట్ చేసింది. తేజా బిగ్ బాస్ రూల్స్ పాటించడం లేదు. అనుమతి లేకున్నా విఐపీ రూమ్ లోకి వెళతాడని కారణం చెప్పింది. అది కేవలం మజాక్ అని సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు తేజా. అయితే శోభా వినలేదు. తేజాను నామినేట్ చేసింది. ఒక భోలే దగ్గరకు వచ్చాక ఆమె ఫైర్ అయ్యారు. బూతులు మాట్లాడటంతో పాటు భోలే ప్రవర్తన నచ్చలేదని ఆమె నామినేట్ చేసింది.

    ఏదో ఫ్లోలో వచ్చాయే నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదన్నాడు. పక్కనే ఉన్న ప్రియాంక కూడా భోలే మీద ఫైర్ అయ్యింది. నువ్వు ఆగు అంటూ… ప్రియాంకతో అన్నాడు. మధ్యలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ప్రస్తావన తెచ్చాడు. దీంతో పల్లవి ప్రశాంత్ ని మధ్యలోకి లాగి అతడి ఓట్లు పొందాలని చేస్తున్నావని శోభా శెట్టి అన్నది. ప్రియాంక, శోభా శెట్టి… ఓ రేంజ్ లో భోలే మీద ఫైర్ అయ్యారు. చివరికి ప్రియాంక థూ అని ఉమ్మి ఊచింది. అదే పని నేను చేస్తే నీ బ్రతుకు ఏం కావాలె అని భోలే ఆమెను అన్నాడు.

    తనని నామినేట్ చేసిన ప్రియాంక, శోభాలను భోలే తిరిగి నామినేట్ చేశాడు. అప్పుడు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక శివాజీ… గౌతమ్, అమర్ లను నామినేట్ చేశాడు. అశ్విని… పూజా మూర్తి, అర్జున్ లను నామినేట్ చేసింది. గౌతమ్… భోలే, శివాజీలను నామినేట్ చేశాడు. కెప్టెన్ యావర్… అమర్, గౌతమ్ లను నామినేట్ చేశాడు. అంతటితో నామినేషన్స్ ప్రక్రియ ముగిసింది.

    అమర్ దీప్, గౌతమ్, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్వినీ, భోలే… 7వ వారానికి నామినేట్ అయినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. నామినేషన్స్ ముగిశాక..ప్రియాంక, శోభా శెట్టిలతో మాట కలిపే ప్రయత్నం చేశాడు.నీతో మాట్లాడేది లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని ఇద్దరూ మండిపడ్డారు. అయినా భోలే ఏదో చేప్పే ప్రయత్నం చేశాడు. యావర్, శివాజీ వచ్చి భోలేను అక్కడి నుండి తీసుకొచ్చేశారు. క్లోజ్ ఫ్రెండ్ శోభా నామినేట్ చేసినందుకు తేజా ఫీల్ అయ్యాడు…