https://oktelugu.com/

Ritu Varma: మెగా కోడలు కాబోతున్న మరో హీరోయిన్?

ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానం లేదు. వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట.

Written By:
  • Shiva
  • , Updated On : October 18, 2023 / 10:32 AM IST

    Ritu Varma

    Follow us on

    Ritu Varma: లావణ్య త్రిపాఠి మెగా కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. జూన్ 9న హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో నిశ్చితార్థం జరిగింది. తాజాగా పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఇటలీ దేశంలో లావణ్య-వరుణ్ ల వివాహం జరగనుంది. అక్కడ గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. నవంబర్ 1న ఈ యంగ్ కపుల్ భార్యాభర్తలుగా మారనున్నారు. వరుణ్ తేజ్-లావణ్యల వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవనున్నారు.

    ఇండస్ట్రీ ప్రముఖులకు ఆహ్వానం లేదు. వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారట. ఇక పెళ్లికి ముందే మెగా ఫ్యామిలీలో వేడుకలు షురూ అయ్యాయి. ప్రీ వెడ్డింగ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తున్నారు. చిరంజీవి తన నివాసంలో వరుణ్, లావణ్యల కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అల్లు అర్జున్ దంపతులు హాజరుకాలేదు.

    అనంతరం అల్లు అర్జున్ మరొక పార్టీ ఏర్పాటు చేశాడు. దీనికి చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో రీతూ వర్మ కనిపించడం విశేషంగా మారింది. మెగా ఫ్యామిలీ మాత్రమే జరుపుకుంటున్న ఫ్యామిలీ ఈవెంట్స్ కి రీతూ వర్మకు ఆహ్వానం ఏమిటనే చర్చ జరుగుతుంది. చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితులకు కూడా లేని ఎంట్రీ రీతూ వర్మకు ఎలా అంటున్నారు. ఇది కొత్త అనుమానాలకు దారి తీసింది.

    2020లో నిహారిక వెడ్డింగ్ రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో జరిగింది. ఈ వేడుకలో కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. అయితే మెగా ఫ్యామిలీతో సంబంధం లేని లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ హాజరుకావడమైంది. కట్ చేస్తే లావణ్య మూడేళ్ళలో వరుణ్ భార్య కాబోతుంది. ఈ క్రమంలో రీతూ వర్మ కూడా మెగా హీరోలలో ఎవరినో ప్రేమిస్తున్నారనే పుకారు లేచింది. అయితే రీతూ లావణ్య బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు. ఆ హోదాలో హాజరవుతుందనే వాదన కూడా ఉంది.