Manchu Family: సీఎం జగన్ తో జరిగిన సినీ పెద్దల సమావేశంలో సీనియర్ హీరో మోహన్ బాబు, మా అధ్యక్షుడు విష్ణు పాల్గొనకపోవడం పట్ల సర్వత్రా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ నుంచి వీరికి ఆహ్వానం అందలేదా అనేది తెలియాల్సి ఉంది. ఏపీలో టికెట్ ధరలపై చిరంజీవి, రాజమౌళి, మహేష్‌బాబు, ప్రభాస్ తదితరులు సీఎం జగన్‌తో చర్చించారు. ఈ భేటీకి మంచు ఫ్యామిలీ సైతం హాజరై తమ అభిప్రాయాలు చెబితే బాగుండేదని అభిమానులు అనుకుంటున్నారు.

అసలు ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల వ్యవహారం పై మొదటి నుంచి మంచు ఫ్యామిలీ దూరంగానే ఉంది. అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్ లకు జగన్ ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందాయి, మరీ జగన్ మంచు ఫ్యామిలీని ఎందుకు పక్కన పెట్టాడు ? జగన్ కి మంచు ఫ్యామిలీకి మధ్య మంచి అనుబంధం కూడా ఉంది, అయినప్పటికీ జగన్ మంచు కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు,
Also Read: తెలుగులో ప్రభాస్ తర్వాత ఆ హీరోతో నటించడం తన డ్రీమ్ అన్న దీపికా పదుకొణే
ఇక ఈ సమావేశంలో సినిమా టికెట్ల ధరలు, చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం సాయం, ఇతర అంశాలు మాట్లాడారు. సీఎం జగన్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హీరోలకు అభయం ఇచ్చాడు. ఇక ఈ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన చిరు అండ్ టీం ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు.

సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈనెలాఖరులోనే జీవో వస్తుందని భావిస్తున్నామని చిరు చెప్పారు. అలాగే చిరు ఇంకా మాట్లాడుతూ.. ‘సినిమా పరిశ్రమపై కొద్దికాలంగా నెలకొన్న సమస్యలకు ఈరోజు సీఎం జగన్‌తో సమావేశంతో పరిష్కారం దొరికిందని చిరంజీవి తెలిపారు. నిజంగానే పరిష్కారం దొరికితే, అ క్రెడిట్ చిరుకే దక్కుతుంది.