Mahesh, Prabhas, NTR, Bunny: టికెట్ రేట్లు పై జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై పెదవి విప్పడానికి కూడా ఏ హీరోకి దైర్యం సరిపోవడం లేదు. అందుకే ఇప్పటివరకు ఏ తెలుగు స్టార్ హీరో ఈ అంశం పై స్పందించలేదు. అయితే విచిత్రంగా తెలుగులో ఎప్పుడో పేడ్ అవుట్ అయిపోయిన హీరో సిద్ధార్ధ్ మాత్రం ఈ టికెట్ వ్యవహారాల పై తన గళం విప్పడం ఆశ్చర్యకరమైన విషయమే. పైగా డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు నేను కొన్ని సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను అంటూ మెసేజ్ స్టార్ట్ చేశాడు.
ఆ మెసేజ్ లో చాలా లోతు ఉంది. ‘ప్రతి ఒక్కరికీ ఒకే రకంగా టికెట్ రేటు పెట్టడం సరికాదు అని, ఏరియాను బట్టి, అలాగే ప్రజలు కట్టే ఇంటి అద్దె మరియు నిత్యావసర వస్తువులను బట్టి.. ఆ ఖర్చులు మొత్తాన్ని లెక్కించి, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా టికెట్ రేట్లును నిర్ణయించండి’ అంటూ సిద్ధార్ధ్ ధైర్యంగా ఒక ట్వీట్ పెట్టాడు.
పైగా సిద్ధార్ధ్ మెసేజ్ లో చాలా ప్రశ్నలే ఉన్నాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఆ ప్రశ్నలు ఉన్నాయి. ఒక రెస్టారెంట్ లో ఇడ్లీ, కాఫీలకు ఎంత ఛార్జ్ చేయాలని చెప్పలేని ప్రభుత్వం, ఒక్క సినిమా టికెట్ విషయంలోనే ఎందుకు ఆంక్షలు పెడుతున్నారు ? ఏ.. ఇండస్ట్రీని కావాలని ఇబ్బందులు పెడుతున్నారా ? అంటూ సిద్ధార్ధ్ ప్రశ్నించడం విశేషం.
Also Read: Tollywood Stars: రిస్కీ లైఫ్స్… సర్జరీలతో సావాసం చేస్తున్న స్టార్స్
నిజమే.. ఒక సినిమా బడ్జెట్ గానీ, దాని యొక్క పరిధిని గానీ నిర్ణయించేది కేవలం ప్రేక్షకులు మాత్రమే. వ్యాపారం చేసుకునే బిజినెస్ మెన్ తన వస్తువు పై ధరను నిర్ణయించొచ్చు ? అలాగే, మందులు, మెడిసిన్స్ అమ్మే వాళ్ళు కూడా తమ ఇష్టప్రకారం అమ్ముకోవచ్చు. కానీ జీవితాలు పణంగా పెట్టి సినిమా తీసే నిర్మాత మాత్రం తన సినిమా టికెట్ రేటును నిర్ణయించుకోకూడదా ?
అసలు ఒక సినిమా ద్వారా ఎంత సంపాదించావ్ ? మాకు ఏమిటి ? అని అడిగే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు. . ఇప్పటికైనా హీరో సిద్ధార్ధ్ లాగే మిగిలిన తెలుగు హీరోలంతా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంచిది. విజ్ఞప్తి చేస్తే చివరకు మిగేలివి కన్నీళ్లే. అయినా ఒక చిన్న హీరోకి ఉన్న దైర్యం స్టార్లకు లేకపోవడం బాధాకరమైన విషయమే.
Also Read: Akhanda Movie: వాళ్ళు నన్ను అలా పిలవడం నచ్చలేదంటూ ఫైర్ అయిన బాలకృష్ణ…