Telangana: తెలంగాణ ప్రభుత్వం పంట మార్పిడికి ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల కాలంలో కేంద్రం, రాష్ర్టం మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాలతో రాష్ర్టం పంట మార్పిడికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రైతులను కూడా ఆ దిశగా తమ పంటల సాగు విధానం మార్చుకోవాలని సూచిస్తోంది. పంట మార్పిడితో దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఎప్పుడు వరి సాగు చేస్తే భూసారం సైతం దెబ్బతినే ప్రమాదమున్నందున పంట మార్పిడిని చేపట్టాలని దిశానిర్దేశం చేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం క్షేత్రస్థాయి పర్యటనకు కూడా వెళ్తోంది. రైతులను ఆరుతడి పంటల వైపు దృష్టి మళ్లించేందుకు సిద్ధం చేయాలని భావిస్తోంది. సీఎం కేసీఆర్ గురువారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటన సందర్భంగా ఆరుతడి పంటల క్షేత్రాలను సందర్శించి రైతులను అడిగి వివరాలు తెలుసుకుని రైతాంగానికి సూచనలు చేయనున్నారు.
ఒకే తరహా వరి పంట వేస్తే భూసారం తగ్గిపోయే సూచనలుండటంతో రైతులు ఆరతడి పంటల వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు సిద్ధం కావాలని చెబుతోంది. దీంతో పంట మార్పిడి కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు కదులుతోంది.
Also Read: Jagan KCR: జగన్ విధానాలను కాపీ కొడుతున్న కేసీఆర్!
ఇప్పటికే ధాన్యం కొనుగోలు విషయంలో రాద్దాంతం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆరుతడి పంటలు వేయాలని నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో గోల జరుగుతున్న సందర్భంలో ఆరుతడి పంటల సాగు ప్రాధాన్యం పెరుగుతోంది. కానీ రైతులు మాత్రం ఆరుతడి పంటల వైపు ఆసక్తి చూపడం లేదు. ఆయకట్టేతర ప్రాంతాల్లో అనువుగా ఉన్నా ఆయకట్టు ప్రాంతాల్లో మాత్రం ఆరుతడి పంటలకు ఎలా సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వ నిర్ణయంతో రైతులు ఆ దిశగా అడుగులు వేస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంంది.
Also Read: Jagan Chandrababu KCR: చంద్రబాబు, కేసీఆర్ ది ఒక రూటు.. జగన్ ది మరో రూటు?