https://oktelugu.com/

Vikram: ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన కమల్ హాసన్ కి దక్కిన గుర్తింపు విక్రమ్ కి మాత్రం ఎందుకు దక్కడం లేదంటే..?

సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొత్తగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడో జరిగిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఆ సినిమాలనేవి ప్రేక్షకుల ఆదరణ పొందవు... కానీ ఆ ప్రయోగాత్మకమైన సినిమాలు చేసిన హీరోకి మాత్రం ప్రేక్షకుల్లో చాలా మంచి గుర్తింపు అయితే వస్తుంది...

Written By:
  • Gopi
  • , Updated On : August 22, 2024 10:37 am
    Vikram

    Vikram

    Follow us on

    Vikram: సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి సినిమాలను చేసినా కూడా ఒక పర్పస్ అయితే ఉండాలి. కమర్షియల్ సినిమాలను చేసే హీరోలు కలెక్షన్లను మాత్రమే టార్గెట్ గా పెట్టుకొని సినిమాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రయోగాత్మకమైన సినిమాలను చేసే హీరోలు ఇటు కలెక్షన్స్ ని, అటు అవార్డులను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేస్తూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కమర్షియల్ సినిమాలతో పోలిస్తే ప్రయోగాత్మకమైన సినిమాలకి ఆదరణ చాలా తక్కువగా ఉంటుందనే చెప్పాలి. ఆ సినిమాకి సక్సెస్ టాక్ వస్తే తప్ప జనాలు థియేటర్ కి వెళ్ళరు. కానీ కమర్షియల్ సినిమాల్లో ఫైట్లు,పాటలు, కామెడీ సీన్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఏదో ఒకటి తమను ఎంగేజ్ చేస్తుందనే ఉద్దేశ్యంతో ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లి కూర్చుంటాడు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు కమల్ హాసన్ చాలా వైవిద్యభరితమైన సినిమాలను చేస్తూనే అందులో సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగాడు. అలాగే స్టార్ హీరోగా వెలుగొందుతూ అప్పుడున్న హీరోలందరికీ పోటీని ఇస్తూ తనను తాను స్టార్ హీరోగా మలుచుకున్నాడు. కానీ ఆయన బాటలో నడుస్తున్న విక్రమ్ మాత్రం ఇప్పటికి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోలేక పోతున్నాడు.

    ఆయన చేసే సినిమాలు మంచి సినిమాలుగా గుర్తింపు పొందుతున్నప్పటికీ సక్సెస్ గా మాత్రం కన్వర్ట్ కావడం లేదు. అందువల్లే ఆయన స్టార్ హీరోగా మారలేకపోతున్నాడు. కమల్ హాసన్ స్టోరీస్ సెలక్షన్స్ లో ఉన్న స్పష్టత విక్రమ్ సినిమాల సెలక్షన్ లలో కనిపించడం లేదు.

    అందువల్లే ఆయన కంటిన్యూస్ గా సక్సెస్ లను ఇవ్వలేకపోతున్నాడు. ఇక ఏది ఏమైనప్పటికీ డిఫరెంట్ అటెంప్ట్ చేయాలంటే దానికి గట్స్ ఉండాలి. విక్రమ్ మాత్రం అలవోకగా అలాంటి ప్రయత్నాలను చేస్తూ మెప్పిస్తు తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికైనా విక్రమ్ తన పంథా ను మార్చుకొని కథల సెలక్షన్ లో మంచి సినిమాలను సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్తే ఆయన కూడా ఇప్పుడు స్టార్ హీరోగా వెలుగొందుతాడనే చెప్పాలి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ కోసం విక్రమ్ పడే కష్టం అంత ఇంత కాదు. దాని పర్ఫెక్షన్ కోసం ఆయన పెట్టే ఎఫర్ట్ చూస్తే ప్రతి ఒక్కరికి మతి పోతుంది.

    ఈ ఏజ్ లో కూడా ఆయన యంగ్ హీరోలకి సైతం పోటీని ఇవ్వగలుగుతున్నాడు అంటే సినిమాల మీద ఆయనకున్న డెడికేషన్ ని మనం అర్థం చేసుకోవాలి. ఏ క్యారెక్టర్ అయినా సరే అందులో ఏమాత్రం డూపుని వాడకుండా ఆ క్యారెక్టర్ ను తను ఓన్ చేసుకొని అందులో ది బెస్ట్ పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు…