Sookshmadarshini: మలయాళం సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలా సినిమాలు కొత్త కాన్సెప్ట్ తో వచ్చి మంచి విజయాలను సాధించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఏది ఏమైనా కూడా వాళ్ల సినిమాల్లో ఒక మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో భాగంగానే ‘సూక్ష్మ దర్శిని’ అనే పేరుతో వచ్చిన సినిమా మంచి పేరు ను సంపాదించుకుంది. నిజానికి ఈ సినిమాలో ఏముంది ఎందుకోసం ప్రేక్షకులు అంతలా ఈ సినిమాకి కనెక్ట్ అవుతున్నారనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇంట్లో ఉండే ఫ్యామిలీ లేడీస్ వాళ్ళకంటూ ఒక సపరేటు వాట్సాప్ గ్రూప్ ని క్రియేట్ చేసుకొని అందులో కొన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే తమ ఇంటి పక్కన బాసిల్ తన ఫ్యామిలీతో పాటు దిగుతాడు. అయితే బాసిల్ అనుకోకుండా కొన్ని ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తుంటే నజ్రియా తనని గమనిస్తుంది. ఇక తన తల్లికి చెబితే మాత్రం తన తల్లి తన కొడుకు మంచోడు అంటూ చెబుతుంది. కానీ నజ్రియా మాత్రం అతన్ని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. ఇక మొత్తానికైతే తను ఏం చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు… ఎటువంటి విషయాల మీద డైవర్ట్ అవుతున్నాడనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే.
అయితే ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా దర్శకుడు చాలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో సినిమాను ముందుకు తీసుకెళ్లాడు. మలయాళం సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి మంచి అంచనాలైతే ఉన్నాయి. తద్వారా మన సినిమాలను కూడా అలాంటి వే లోనే పట్టకెక్కించే ఉద్దేశ్యంతో మన దర్శకులు అనుకున్నప్పటికీ అది మన దగ్గర కొంతవరకు వీలుపడడం లేదు. కానీ వాళ్ళు మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా సినిమాలను చేస్తున్నారు.
ఇక దర్శకుడు జితిన్ ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టించకుండా ముందుకు తీసుకెళ్లిన విధానం కూడా చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి…ఇక ఏది ఏమైనా నజ్రియా మాత్రమే ఈ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఇక తన యాక్టింగ్ తో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది… మరి ఈ సినిమా ప్రస్తుతానికి థియేటర్లలో ఆడుతుంది. ఇక ఓటిటిలో మరి కొంతమంది ఈ సినిమాను చూసి ఆదరించే అవకాశాలైతే పుష్కలంగా ఉన్నాయనే చెప్పాలి…