
Junior NTR: హీరో ఎన్టీఆర్ ఇంట్లో బుధవారం రాత్రి పార్టీ జరిగింది. ఈ పార్టీలో కొద్ది మంది చిత్ర ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. సమయం సందర్భం లేకుండా ఎన్టీఆర్ పార్టీ ఇవ్వడం చిత్ర వర్గాల్లో చర్చకు తెరలేపింది. మార్చి 27న రామ్ చరణ్ తన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. చిరంజీవి స్వయంగా చిత్ర ప్రముఖులను చరణ్ బర్త్ డే పార్టీకి ఆహ్వానించారు. దీంతో దాదాపు పరిశ్రమ మొత్తం రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కొలువుదీరారు. ఫ్యామిలీ మెంబర్ అయిన అల్లు అర్జున్, ఆర్ ఆర్ ఆర్ కో స్టార్ ఎన్టీఆర్ ఈ పార్టీకి రాకపోవడంపై పలు పుకార్లు వినిపించాయి.
అల్లు అర్జున్ సంగతి అటుంచితే ఎన్టీఆర్ రావాల్సింది. కారణం రామ్ చరణ్ బర్త్ డే పార్టీతో పాటు ఆస్కార్ విన్నర్స్ సన్మాన కార్యక్రమం గా దీన్ని నిర్వహించారు. చిరంజీవి దంపతులు కీరవాణి, చంద్రబోస్, రాజమౌళితో పాటు ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ని సత్కరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోనే ఉన్న ఎన్టీఆర్ రాకపోవడం వివాదాస్పదం అయ్యింది. రామ్ చరణ్-ఎన్టీఆర్ లకు దూరం పెరిగిందనే ఊహాగానాలకు ఊతం ఇచ్చింది.
రామ్ చరణ్ బర్త్ డే పార్టీకి రాని ఎన్టీఆర్ తన నివాసంలో స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ విందుకు అతి కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్, మైత్రీ నిర్మాతలైన నవీన్, రవి శంకర్ పాల్గొన్నారు. అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ ఎన్టీఆర్ పార్టీకి హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరిశ్రమ ప్రముఖులందరికీ ఆహ్వానం ఉందో లేదో తెలియదు కానీ… ఎన్టీఆర్ పార్టీకి చిత్ర పరిశ్రమ దూరంగా ఉంది.

అసలు ఈ పార్టీ నిర్వహించడానికి ప్రధాన కారణం అనేది తెలియరాలేదు. బహుశా రామ్ చరణ్ పార్టీ ఇచ్చారు కాబట్టి తాను కూడా ఇచ్చాడా? అదే నిజమైతే అతికొద్ది మందిని మాత్రమే ఎందుకు పిలిచాడు? ఒకవేళ పిలిచినా రాలేదా? ఇలా పలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కాగా మే నెలలో ఎన్టీఆర్ బర్త్ డే ఉంది. అప్పుడు రామ్ చరణ్ మాదిరి గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తారా? లేక ఇప్పుడు ఏర్పాటు చేసిన పార్టీతో సరిపెడతారా? అనే సందేహం కలుగుతుంది. మరి చూడాలి ఎన్టీఆర్ ఏం చేశాడో…