
Rajeev Kanakala- Prakash Raj: ఇండస్ట్రీ లో ఒక మంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు పాపులర్ యాంకర్ సుమ భర్త గా రాజీవ్ కనకాల కి ఎంత మంచి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి, ఇప్పటికీ మంచి డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్న వ్యక్తి ఆయన. ఇండస్ట్రీ లో ఇన్నేళ్లు ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఇతనిపై ఎలాంటి కాంట్రవర్సీ రాలేదు. ఈమధ్యనే ఈయన సుమతో విడాకులు తీసుకోబోతున్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ అది కేవలం పుకారు మాత్రమే అని రాజీవ్ కనకాల మరియు సుమ స్వయంగా తెలిపారు.
ఇన్నేళ్ల ఇండస్ట్రీ లో ఆయన తన తోటి ఆర్టిస్టులపై ఫైర్ అవ్వడం వంటి సందర్భాలను ఇది వరకు మనం చూడలేదు. కానీ మొట్టమొదటిసారి రాజీవ్ కనకాల తన తోటి నటుడైన ప్రకాష్ రాజ్ పై చాలా తీవ్రస్థాయి లో విరుచుకుపడ్డాడు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయం లో ప్రకాష్ రాజ్ వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేసాడు.

ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ రాజీవ్ కనకాల ని ఒక ప్రశ్న ఆడుతూ ‘మా ఎన్నికలు జరిగిన సమయం లో మీరు ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు సపోర్టు చెయ్యలేదు’ అని అడగగా దానికి రాజీవ్ కనకాల సమాధానం చెప్తూ ‘అప్పట్లో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలు నాకు ఏమాత్రం నచ్చలేదు. ఈయన వల్లే నేషనల్ అవార్డు తెలుగు సినిమా ఇండస్ట్రీ కి వచ్చిందట,ఈయన లేకపోతే మనకి నేషనల్ అవార్డు దిక్కే లేదట. తెలుగు లో ఎన్నో సినిమాలు చేసి, తెలుగు సినిమాని అవమానించడం నాకు ఏమాత్రం నచ్చలేదు. నీవల్ల అవార్డు రావడం ఏమిటి..? , ఎంతోమంది కస్టపడి పనిచేస్తే నీకు అవార్డు వచ్చింది, అంతే కాదు నాలాగా తెలుగు మాట్లాడే ఆర్టిస్టు లేదని అప్పట్లో చెప్పాడు. నీకు తెలుగు బాగా వచ్చినందుకు మాకు సంతోషమే, కానీ పక్క వాళ్ళని అవమానించొద్దు, నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేయకూడదు’ అంటూ సమాధానం ఇచ్చాడు రాజీవ్ కనకాల.