
Anchor Suma : ఈ మధ్య చిన్న సినిమా హీరోలు ప్రమోషన్స్ కోసం ఒక బ్యాడ్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు. తమ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడానికి సిల్లీ పనులు చేస్తున్నారు. యూట్యూబర్స్ కంటే దారుణమైన ఫ్రాంక్స్ ప్లే చేస్తున్నారు. ఇవి విమర్శలపాలవుతున్నా తగ్గడం లేదు. అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్ర ప్రమోషన్ కోసం విశ్వక్ సేన్ పబ్లిక్ లో ఓ ఫ్రాంక్ వీడియో చేశాడు. ఓ వ్యక్తి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేస్తుండగా విశ్వక్ అతన్ని సముదాయిస్తున్నట్లు నటించారు. ఇది వివాదానికి దారి తీసింది.
పబ్లిక్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? హీరోకి కనీస బాధ్యత లేదా? అని విశ్వక్ మీద నెటిజెన్స్ మండిపడ్డారు. బిగ్ బాస్ సన్నీ, హీరో నందు ఇలాంటి ఫ్రాంక్స్ చేశారు. తాజాగా అల్లరి నరేష్ ఇదే పద్ధతిని ఎంచుకున్నాడు. కొంచెం పలుకుబడి ఉన్న హీరో కావడంతో ఏకంగా స్టార్ యాంకర్ సుమను రంగంలోకి దించాడు. సుమ అరెస్ట్ అయినట్లు సంకెళ్లతో ఉన్న ఓ ఫోటో విడుదల చేశారు. అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది.
నిజంగానే సుమ అరెస్ట్ అయ్యిందని అభిమానులు కంగారు పడ్డారు. సుమ ఏం తప్పు చేస్తే పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారనే చర్చ మొదలైంది. మెల్లగా ఇది ప్రమోషన్ అని రివీల్ చేశారు. మీ ఫేవరెట్ యాంకర్ సుమ సీఐ శివ కుమార్ కస్టడీలో ఉంది అంటూ అల్లరి నరేష్ ట్వీట్ చేశాడు. దాంతో సుమ అరెస్ట్ డ్రామా వెలుగులోకి వచ్చింది. నరేష్ లేటెస్ట్ మూవీ ఉగ్రం. ఆయన పోలీస్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషనల్ లో భాగంగా సుమ అరెస్ట్ అయినట్లు ప్రచారం చేశారు.
సుమ సీనియర్ యాంకర్. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు ఆమెను సొంత మనిషిలా ఫీల్ అవుతారు. అలాంటి సుమ ఇలాంటి సిల్లీ స్టంట్స్ వేయడం దారుణం. విశ్వక్ సేన్ చేసిన దానికంటే కూడా న్యూసెన్స్ అని చెప్పాలి. పేరు గౌరవం ఉన్న సెలెబ్రిటీలు కూడా ఇలాంటి దిగజారుడు ఫ్రాంక్స్ కి పాల్పడటం దారుణమని పలువురు అభిప్రాయపడుతున్నారు. సుమ వైఖరిని ఖండిస్తున్నారు. ఇకనైనా సుమ తన ఇమేజ్ కి తగ్గట్లు ప్రవర్తిస్తే బాగుంటుందని పలువురు కోరుకుంటున్నారు. పెద్ద పెద్ద డైరెక్టర్స్, స్టార్స్ తమ చిత్రాల ఈవెంట్స్ లో యాంకర్ గా ఉన్న ఆమెను గారు అని సంబోధిస్తారు. అది ఎవరికీ దగ్గని గౌరవం అని చెప్పొచ్చు.