Animal: పాకిస్తాన్ కథనే హిట్ ఫార్ములా ఎందుకు అయింది..?

రిలీజ్ అయిన అనిమల్ సినిమా కథ ఇండియాలో మొదలై పాకిస్తాన్ లో ఎండ్ అవుతుంది. హీరో వాళ్ళ నాన్నను చంపాలనుకున్న వాన్ని పాకిస్తాన్ కి వెళ్లి హీరో చంపేసి వస్తాడు...ఇక అదే విధంగా నాగ చైతన్య హీరో గా వస్తున్న తండేల్ సినిమా స్టోరీ కూడా పాకిస్తాన్ రిలేటెడ్ గా సాగుతుంది.

Written By: Gopi, Updated On : December 9, 2023 8:58 am

Animal OTT

Follow us on

Animal: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం వస్తున్న కొత్త కథలు వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్నాయి. ఇక ఇప్పటికే అనిమల్ లాంటి ఒక వైల్డ్ స్టోరీ అనేది పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని అందుకోగా, దీని తర్వాత ఇప్పుడు సలార్ అనే సినిమా కూడా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయితే ఇండియన్ సినిమాకి తిరుగులేదనే చెప్పాలి. ప్రతి సినిమా కూడా తమదైన రీతిలో ప్రేక్షకులను అలరిస్తూ మంచి కలక్షన్స్ ని రాబట్టే ప్రయత్నం చేస్తున్న సినిమాలుగా ఈ సినిమాలన్నీ చరిత్రలో నిలిచిపోతాయి…

ఇక ఇది ఇక ఉంటే ఈమధ్య రిలీజ్ అయిన అనిమల్ సినిమా కథ ఇండియాలో మొదలై పాకిస్తాన్ లో ఎండ్ అవుతుంది. హీరో వాళ్ళ నాన్నను చంపాలనుకున్న వాన్ని పాకిస్తాన్ కి వెళ్లి హీరో చంపేసి వస్తాడు…ఇక అదే విధంగా నాగ చైతన్య హీరో గా వస్తున్న తండేల్ సినిమా స్టోరీ కూడా పాకిస్తాన్ రిలేటెడ్ గా సాగుతుంది. ఇక ఈ మధ్య సినిమాలన్నీ కూడా పాకిస్థాన్ ని లింక్ చేసుకొని రాసుకొన్న స్టోరీ తో సినిమాలుగా వచ్చి మంచి విజయాలను సాధిస్తున్నాయి…ఇక ఇప్పటికే అనిమల్ కథ పాకిస్థాన్ రిలేటెడ్ గా వచ్చింది. ఇక దాంతో ఇపుడు తండేల్ కథ కూడా పాకిస్తాన్ కథాంశంతో వస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఇంతకు ముందు కూడా ఇలాంటి కథాంశాలతో చాలా సినిమాలు వచ్చి మంచి సక్సెస్ లను అందుకున్నాయి.

ఇక అలాగే శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో వస్తున్న సినిమా కూడా ఇండియా పాకిస్తాన్ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ఒక క్యూట్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు మొత్తం ఇండియా పాకిస్తాన్ ట్రెండ్ అనేది ఎక్కువగా నడుస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇకమీదట కొత్తగా వచ్చే మేకర్స్ కూడా ఇలాంటి కథలు రెడీ చేసుకుని సినిమా చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మనం అన్ని విషయాల్లో శత్రువుగా భావించే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన కథ కథనాన్ని రాసుకుని మనమేకర్స్ తీసి సక్సెస్ లు అందుకోవడం చాలా మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన బజరంగీ భాయిజాన్ సినిమా కూడా పాకిస్తాన్ రిలేటెడ్ గా వచ్చిందే. కథలో దమ్ము ఉండాలి గాని ఏ బ్యాక్ డ్రాప్ లో కథలు తీసుకొని సినిమాలుగా చేసిన కూడా ప్రేక్షకులకు నచ్చుతుంది అని చాలామంది అభిప్రాయపడుతున్నారు…