Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. అయితే మహేష్ బాబు ఇండస్ట్రీకి హీరో గా ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు కృష్ణ గారు ఎవరితో మహేష్ ని లాంచ్ చేద్దాం అనే ఆలోచనలో పడ్డప్పుడు కృష్ణ గారు కొంతమంది స్టార్ట్ డైరెక్టర్లను అనుకొని వాళ్ళతో తన కొడుకుని లాంచ్ చేయాలని అడిగితే వాళ్లు పెద్ద గా అసక్తి చూపించలేదంట. దాంతో స్టార్ డైరెక్టర్ అయిన రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చి ఎలాగైనా సరే మహేష్ బాబుని మీరే లాంచ్ చేయాలని పట్టుబట్టి కూర్చోవడంతో రాఘవేంద్ర రావు మహేష్ బాబుని రాజకుమారుడు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా సక్సెస్ బాట పట్టి వరుసగా విజయాలను అందుకుంటు ముందుకు కదులుతున్నాడు. సూపర్ స్టార్ అనే బిరుదుని కూడా సంపాదించుకున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో మహేష్ బాబు ని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయడానికి కృష్ణ గారు మొదట కొంత మంది డైరెక్టర్లను అడిగినపుడు వాళ్ళు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అప్పుడు మహేష్ బాబు చాలా బాధపడ్డడట ఆ విషయాన్ని ఆయన తన సన్నిహితుల దగ్గర అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు అంట.
దాంతో మహేష్ బాబు మంచి హీరో అయ్యక ఆ డైరెక్టర్ మహేష్ బాబుతో సినిమా చేయాలని వచ్చినప్పుడు మహేష్ బాబు అతన్ని పెద్దగా పట్టించుకోకుండా రిజెక్ట్ చేశారంట. కృష్ణ ఉండి ఆ డైరెక్టర్ తో సినిమా చేద్దామని చెప్పినప్పటికీ మహేష్ బాబు మాత్రం అతనితో సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు అంటే భాష లాంటి సూపర్ హిట్ సినిమాను తీసిన సురేష్ కృష్ణ అని తెలుస్తుంది. సురేష్ కృష్ణ అప్పట్లో వెంకటేష్, చిరంజీవి నాగార్జున, ప్రభాస్ లాంటి స్టార్ హీరో లతో సినిమాలు చేశాడు…
ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం లో వస్తున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడమే కాకుండా సినిమా పైన విపరీతమైన అంచనాలను పెంచింది. ఇక నిన్న గుంటూరు లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేశారు…