https://oktelugu.com/

Gopichand: కెరియర్ మొదట్లో ప్రభాస్ తో పోటీ పడి గెలవలేక ఢీలా పడిన ఆ స్టార్ హీరో ఎవరంటే..?

తెలుగులో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సలార్ సినిమాతో 700 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించాడు.

Written By:
  • Gopi
  • , Updated On : January 10, 2024 / 09:23 AM IST

    Gopichand

    Follow us on

    Gopichand: కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తనలోని నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దాంతో నటుడిగా ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక అప్పటినుంచి తను ఏమాత్రం వెనకడుగు వేయకుండా మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ హిట్ సినిమాలు చేసుకుంటూ ముందుకు కదులుతూ వస్తున్నాడు.

    తెలుగులో మొదలైన ఆయన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా సలార్ సినిమాతో 700 కోట్ల వరకు కలక్షన్స్ ని రాబట్టి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ అంటే ఒక స్టార్ హీరో ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరో అనే చెప్పాలి…

    అయితే ప్రభాస్ స్టార్ హీరోగా ఎదుగుతున్న క్రమంలో తనతోపాటు తన కో ఆర్టిస్ట్ అయిన గోపీచంద్ కూడా మంచి హీరోగా గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే మొదటగా వీళ్లిద్దరూ వర్షం సినిమాలో కలిసి నటించారు ఆ సినిమాలో ప్రభాస్ హీరోగా చేస్తే, గోపీచంద్ విలన్ గా నటించాడు. ఇక ఆ తర్వాత గోపీచంద్ కూడా హీరోగా మారి యజ్ఞం అనే సినిమా చేశాడు ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దాంతో గోపీచంద్, ప్రభాస్ ఇద్దరు పోటాపోటీగా ఎదుగుతూ వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలో ప్రభాస్ కి ఛత్రపతి లాంటి సినిమా రావడంతో తను ఒక్కసారిగా స్టార్ హీరోగా మారిపోయాడు. కానీ గోపీచంద్ కు మాత్రం అడపదడపా సక్సెస్ లు వచ్చినప్పటికీ అవి ఆయన్ని స్టార్ హీరో గా నిలబెట్టులేకపోయాయి.

    ఇక దాంతో గోపీచంద్ బి గ్రేడ్ హీరోగా మిగిలిపోయాడు. అయితే గోపీచంద్ ప్రభాస్ తో ఎప్పుడు పోటీ పడలేదు కానీ వాళ్ళిద్దరి బాడీ గాని వాళ్ళు చేస్తున్న యాక్షన్ సినిమాలను గాని చూసిన జనాలే వీళ్ళిద్దరి మధ్య పోటీ ని పెట్టీ ఇద్దరు స్టార్ హీరోలు అవుతారు అంటూ చాలా రకాలుగా కామెంట్లు అయితే చేశారు. అయితే ఇప్పటికీ కూడా ప్రభాస్, గోపిచంద్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతున్నారు…