https://oktelugu.com/

Sukumar: సుకుమార్ ఎందుకు 1990, 2000 టైమ్ లైన్ స్టోరీ లను చేస్తున్నాడు…ప్రజెంట్ స్టోరీ లను చేయడం రాదా..?

సినిమా ఇండస్ట్రీ లో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ సుకుమార్ కి ఉన్న క్రేజ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి. ఆయన చేసిన సినిమాలు హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా ప్రేక్షకాదరణ పొందుతూ ఉంటాయి...

Written By:
  • Gopi
  • , Updated On : September 16, 2024 / 02:31 PM IST

    Sukumar

    Follow us on

    Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సుకుమార్..ఆయన చేసిన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ‘ఆర్య ‘ సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే ఆయన రామ్ తో చేసిన ‘జగడం ‘ అనే సినిమా చేసి ఫ్లాప్ ని మూట గట్టుకున్నాడు. ఇలా ఒక హిట్టు మరొక ఫ్లాపుతో కెరీయర్ ను లాగించుకుంటూ వచ్చిన సుకుమార్ ఎప్పుడైతే రామ్ చరణ్ తో ‘రంగస్థలం ‘ సినిమా చేశాడో అప్పుడు స్టార్ డైరెక్టర్ గా మారిపోవడమే కాకుండా తనకున్న ఇమేజ్ ను అమాంతం తారా స్థాయికి పెంచుకున్నాడు. ఇక ఆ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో అల్లు అర్జున్ తో చేసిన ‘పుష్ప ‘ సినిమా భారీ సక్సెస్ గా నిలవడమే కాకుండా బాలీవుడ్ లో ఆయనకు భారీ గుర్తింపును కూడా తీసుకొచ్చింది. ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీలో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. ఇక ఇప్పుడు ‘పుష్ప 2 ‘ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే వరుసగా మూడు సినిమాలను 1990, 2000 టైమ్ లైన్ లోనే తెరకెక్కించాడు.

    మరి ఇలా ఎందుకు ఆయన ఆ టైమ్ లైన్ ను మాత్రమే తన సినిమా కోసం ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టైమ్ లైన్ లో ఆయన సినిమాలను చేయలేడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిజానికి సుకుమార్ ఏ జోనర్ లో అయినా సినిమా చేసి మెప్పించగలిగే సత్తా ఉన్న దర్శకుడు అయినప్పటికీ వరుసగా అలాంటి సినిమాలే చేసేసరికి ప్రస్తుతం ప్రేక్షకులకు సుకుమార్ మీద బోర్ కొట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.

    ఇక ఇప్పుడు పుష్ప 2 తర్వాత ఆయన రామ్ చరణ్ తో చేయబోయే సినిమా ప్రజెంట్ టైమ్ లైన్ లో ఉండేలా చూసుకుంటే మంచిదని పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇక మొత్తానికైతే సుకుమార్ తనదైన రీతిలో పుష్ప 2 సినిమాతో 1000 కోట్ల కలెక్షన్లను రాబట్టడమే లక్ష్యం గా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు.

    మరి ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ ప్రచారం అయితే జరుగుతుంది. మరి నిజంగానే ప్రేక్షకుల ముందుకు వస్తుందా? లేదంటే మళ్లీ పోస్ట్ పోన్ అవుతుందా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు… చూడాలి మరి సుకుమార్ ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి రామ్ చరణ్ తో చేయబోయే సినిమాని ప్రజెంట్ టైమ్ లైన్ లో తెరకెక్కిస్తే మంచిదని చాలామంది సుకుమార్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు…