Prashanth Neel: డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ఎక్కడ విన్న ఈ పేరే వినిపిస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ నీల్ పేరు మారుమోగుతోంది.
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తాజాగా వచ్చిన మూవీ ‘సలార్’. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శృతిహాసన్ కథనాయకగా కనిపించారు. కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులను ఆలరిస్తుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తోంది. అయితే సలార్ మూవీ ఓ వైపు ప్రభంజనం సృష్టిస్తుండగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ విజయ రహస్యాలంటూ సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
సాధారణంగా ఎవరైనా సినిమాల మీద ఆసక్తితో ఇష్టంతో ఈ రంగంలోకి అడుగు పెడతారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా డైరెక్షన్ కోర్సు చేసి దర్శకుడిగా మారారట. అయితే సినీ ఇండస్ట్రీ ఏదైనా కొత్త వారికి అంత తొందరగా ఛాన్సులు రావన్న సంగతి తెలిసిందే. దీంతో కన్నడలో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తన బావ శ్రీమురళికి ఓ కథ వినిపించారట. కథ నచ్చకపోవడంతో పాటు అనుభవం లేదని ఆయన నిరాకరించడంతో ప్రశాంత్ నీల్ ఓ మాస్ స్క్రిప్ట్ రెడీ చేసి శ్రీమురళికి మరోసారి వినిపించారట. అయితే ఈ కథ నచ్చడంతో ఆయన ఓకే చెప్పడంతో చిత్రీకరణ ప్రారంభమైంది. 2014 లో ప్రేక్షకుల ముందుకు ‘ఉగ్రం’ పేరుతో వచ్చిన ఈ సినిమా కన్నడనాట సెన్షేషన్ క్రియేట్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు.
మొదటి సినిమానే సూపర్ హిట్ గా నిలవడంతో డైరెక్టర్ గా ప్రశాంత్ నీల్ పేరు మారు మోగింది. ఆ తరువాత యశ్ హీరోగా కేజీఎఫ్ సినిమా తీశారు. ఈ చిత్రం కన్నడనాటే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా ప్రశాంత్ నీల్ గురించి మాట్లాడుకున్నారు. కేజీఎఫ్ రెండు పార్టుల తరువాత వచ్చిన సలార్ మూవీతో ఆయన పేరు పాన్ ఇండియా రేంజ్ లో చక్కర్లు కొడుతుంది.
ప్రశాంత్ నీల్ కు ఓసీడీ సమస్య ఉందంట. అందుకే ఆయన సినిమాల్లో అంతా బ్లాక్ గా కనిపిస్తుందని ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా వెల్లడించారు. అలాగే బొగ్గు అంటే ఇష్టాన్ని కలిగి ఉన్న ప్రశాంత్ నీల్ ఆయన ప్రతి సినిమాలో బొగ్గే కనిపిస్తుందని తెలుస్తోంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ మూలాలు తెలుగు నేలపై ఉన్నాయని తెలుస్తోంది. ఏపీలోని ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం ప్రశాంత్ నీల్ స్వగ్రామం అని సమాచారం. అయితే ప్రశాంత్ నీల్ పుట్టకముందే ఆయన తల్లిదండ్రులు బెంగళూరులో సెటిల్ అయ్యారు. అలా ఆయన కన్నడ వ్యక్తిగా పేరుగాంచారు. అయితే ఆయన మీద ఉన్న తెలుగు ప్రభావమే సినిమాల్లో కనిపిస్తుందని అభిమానులు చెబుతున్నారు. ప్రశాంత్ నీల్ మరిన్ని మాస్ సినిమాలు చేస్తూ మరింతగా రాణించాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు.