https://oktelugu.com/

Kalyan Ram And NTR: కళ్యాణ్ రామ్ కు జూ. ఎన్టీఆర్ ఎందుకు సారీ చెప్పారు.. ఆ కథేంటి?

అన్నదమ్ముల మధ్య పాజిటివ్, నెగిటివ్ రెండు సంబంధాలు కూడా కనిపిస్తుంటాయి. నెగటివ్ తక్కువ పాజిటివ్ ఎక్కువ. దీంతో అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలంటారు. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడంలో ముందుంటారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 25, 2023 5:51 pm
    Kalyan Ram And NTR

    Kalyan Ram And NTR

    Follow us on

    Kalyan Ram And NTR: నందమూరి హీరోలంటే ఇష్టపడని వారుండరు. ఈ హీరోలకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగే వేరు. అందరిలో ముఖ్యంగా బాలయ్య, ఎన్టీఆర్ ముందుంటారు. ఇక కళ్యాణ్ రామ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ తన రేంజ్ ను మరింత పెంచుకునే పనిలో పడ్డారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా బిజీ బిజీగానే ఉన్నారు. ఇక ఈ ఇద్దరి గురించి కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వార్త చక్కర్లు కొడుతుంది.

    అన్నదమ్ముల మధ్య పాజిటివ్, నెగిటివ్ రెండు సంబంధాలు కూడా కనిపిస్తుంటాయి. నెగటివ్ తక్కువ పాజిటివ్ ఎక్కువ. దీంతో అన్నదమ్ములంటే ఇలాగే ఉండాలంటారు. ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడంలో ముందుంటారు. నిర్మాతగా కళ్యాణ్ రామ్, హీరోగా ఎన్టీఆర్ ఇద్దరు కూడా ఒకరికి ఒకరు సహాయపడుతుంటారు. నందమూరి ఫ్యామిలీని పక్కన పెట్టి కూడా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. కళ్యాణ్ రామ్ సినిమాల ఈవెంట్స్ కు వచ్చి ఎన్టీఆర్ సందడి చేయడం కూడా చూస్తుంటాం. అన్న సినిమాలకు తమ్ముడు వచ్చి కూడా క్రేజ్ పెంచుతుంటారు.

    అమిగోస్, బింబిసార ఇలా ప్రతి సినిమాకు ఎన్టీఆర్ అన్న కోసం ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కళ్యాన్ రామ్ డెవిల్ సినిమా రోబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాలు పంచుకోలేకపోతున్నారట. దీంతో ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్టీఆర్ డెవిల్ ఈవెంట్స్ కి రావడం లేదని టాక్. ఆయన ఫ్యామిలీతో క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళుతున్నారట. అందువల్ల కళ్యాణ్ రామ్ సినిమా ఈవెంట్స్ లో పాల్గొనలేకపోతున్నారు జూ. ఎన్టీఆర్.

    ఇక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను సెలబ్రేటీలు కొత్త ప్రదేశాల్లో లేదా మరో దేశంలో సెలబ్రేట్ చేసుకుంటారు. కొత్త దేశం, కొత్త ఏడాది అంటూ ఎంజాయ్ చేస్తారు. ఈ సారి ఎన్టీఆర్ కూడా అమెరికాలో ఈ సెలబ్రేషన్స్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అంటే తమ్ముడి సినిమా ఈవెంట్ కు హాజరు అవడం చాలా కష్టం. దీంతో కళ్యాణ్ రామ్ కు ఎన్టీఆర్ సారీ చెప్పారని కూడా టాక్. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో?