Naga Chaitanya: సినిమా ఇండస్ట్రీలో పేరు సంపాదించడం అంత ఈజీ కాదు. ఒక సినిమాను మించి మరొక సినిమా ఉండాలి. లేదంటే కష్టమే. ఇలా అహర్నిశలు కష్టపడుతూ ఉంటేనే సినీ కెరీర్ లో మంచి మార్కును సంపాదించగలుగుతారు. ప్రస్తుతం ఈ విధంగానే చాలా మంది స్టార్లు కష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే స్టార్లు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ఒక దానికి మించి మరొక పాత్ర చేస్తూ చాలా అవార్డులను కూడా అందుకుంటుంటారు. కానీ నాగచైతన్య మాత్రం కాస్త వెనకపడ్డారు అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.
ఇండస్ట్రీలో ఒక హీరోగా రాణించాలంటే మాత్రం చాలా కష్టమైన పనే అని చెప్పడంలో సందేహం లేదు. ఒక్కసారి ఫ్లాప్ రిజల్ట్ వస్తే చాలు మళ్ళీ హిట్ పడేవరకు ఆ హీరో కెరీర్ లైఫ్ రిస్క్ లో ఉన్నట్టే. అయితే అక్కినేని నాగార్జున సీనియర్ మోస్ట్ వాంటెడ్ హీరోగా టాప్ ప్లేస్ లో ఉన్నారు. కానీ నాగచైతన్య మాత్రం మీడియం రేంజ్ హీరోల లిస్ట్ లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ఎన్నో సినిమాల్లో నటించినా తగిన సక్సెస్ లేకపోవడంతో ఆయన స్టార్ హీరోల లిస్ట్ లో చేరలేకపోతున్నారట.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి నటులు ఫాన్ ఇండియా స్టార్లుగా గుర్తింపు పొందుతూ గ్లోబల్ స్టార్లుగా వెలుగుతుంటే నాగచైతన్య మాత్రం ఇంకా సెకండ్ గ్రేట్ హీరో గానే గుర్తింపు సంపాదించారు. ఇక ఈయన స్టార్ గా మారాలంటే చాలా కసరత్తలు చేయాల్సిందే. ఇప్పటికే ఈయన చాలా సినిమాల్లో నటించినా కొన్ని హిట్ లను సొంతం చేసుకున్నాయి. కానీ అవి స్టార్ స్టేటస్ లో నిలబెట్టలేకపోయాయి. అందుకే సెకండ్ లిస్ట్ లోనే ఉండిపోయారు చైతూ.
ఇక తనతో పాటు నటించిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకొని విమర్శల పాలయ్యారు. ఈ విషయం కాస్త కెరీర్ పరంగా మైనస్ అయిందనే చెప్పాలి. ఆ డిప్రెషన్ లో ఉన్న చైతూ కాస్త సినిమాల పరంగా నెగ్లెట్ చేశారు అంటూ కామెంట్లు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఆ డిప్రెషన్ నుంచి కోలుకొని మళ్లీ కెరీర్ పరంగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇప్పుడు అయినా తండ్రి లాంటి పేరు సంపాదించాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈయన కెరీర్ ముందు ముందు ఎలా ఉండనుందో..