ఈ బూతు పురాణానికి కారణం ఎన్టీఆరే !

ప్రతి మహిళనూ నోరారా ‘అమ్మా’ అని సంబోధిస్తూ మహిళలను గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ మీరాచోప్రా విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడని సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలుగుతున్న మాట వాస్తవం. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’ సినిమాతో పాటు చాలా సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఈ ఫేడ్ అవుట్ బ్యూటీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోరాటంతో జాతీయ స్థాయిలో వచ్చేసింది. వివాదం పై మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం, సైబర్‌ సెల్ పోలీసులు […]

Written By: admin, Updated On : June 6, 2020 5:18 pm
Follow us on


ప్రతి మహిళనూ నోరారా ‘అమ్మా’ అని సంబోధిస్తూ మహిళలను గౌరవించే జూనియర్ ఎన్టీఆర్ మీరాచోప్రా విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నాడని సగటు ప్రేక్షకుడికి కూడా సందేహం కలుగుతున్న మాట వాస్తవం.
ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ‘బంగారం’ సినిమాతో పాటు చాలా సినిమాలు చేసినా రాని పాపులారిటీ ఈ ఫేడ్ అవుట్ బ్యూటీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై పోరాటంతో జాతీయ స్థాయిలో వచ్చేసింది. వివాదం పై మంత్రి కేటీఆర్ సైతం స్పందించడం, సైబర్‌ సెల్ పోలీసులు సైతం ద‌ర్యాప్తు చేస్తూ విచారణ జరుపుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఇప్పటికే ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసులు నమోదు చేసాక కూడా, ఎన్టీఆర్ మౌనాన్ని విడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అయినా, మీరా చోప్రా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదాల బూతు పురాణం పై ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తెలిపే వరకూ వచ్చాక కూడా అసలు ఎన్టీఆర్ స్పందించకపోవడం ఏమిటి ? నిజానికి వివాదం మొదలైన మొటిరోజే.. మీరా చోప్రా, ఫ్యాన్స్ పై ముందుగా ఎన్టీఆర్ కే పిర్యాదు చేసింది. అప్పుడే తారక్ స్పందించి ఈ వివాదాన్ని ముగించి ఉంటే, ఇంత రచ్చ జరిగి ఉండేదా ? నిజమే, ఏ స్టార్ హీరో లక్షల మంది అభిమానులను నియంత్రణలో పెట్టలేరు. కానీ, ఒక మహిళ పై మానసిక దాడి తప్పు అని చెప్పడానికి ఏమైంది ? చెప్పలేదు అంటే మీరాచోప్రా పై ఎన్టీఆర్ కూడా అదే బావనతో ఉన్నాడా ?

నిజానకి జరిగింది ఏమిటంటే, మహేష్ ఫ్యాన్స్ తారక్ పై చేసిన ట్రోలింగ్‌ ని మీరాచోప్రా లైక్ చేసింది. దాంతోనే ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ప్రవర్తించి అసభ్య పదజాలం వాడారు. కాబట్టి, ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కే సపోర్ట్ చేస్తున్నాడా ? పోలీసులు, కేసులు వరకూ వెళ్ళాక కూడా ఎన్టీఆర్ ఇంకా మౌనమే వహిస్తే అలాగే అనుకోవాల్సి ఉంటుందిగా. సాధారణంగా ఇటువంటి వాటికి ఎన్టీఆర్ స్పందించరని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఇప్పుడు సాధారణమైనది కాదు, ఎన్టీఆర్ సైతం ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చినా ఆగని స్థాయికి వెళ్ళిపోయింది. ‘మీటూ’ అనే ట్యాగ్ లేదు గాని, ఆ రేంజ్ లోనే సాగుతుంది ఈ వివాదం. ఒక్కటి మాత్రం నిజం ఎన్టీఆర్ మౌనమే దీనికి కారణం. మరి ఎన్టీఆర్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.