Udugula Venu: సినిమా ఇండస్ట్రీకి మొదట రైటర్స్ గా ఎంట్రీ ఇచ్చిన చాలామంది ఆ తర్వాత దర్శకులుగా మారి తమ సత్తా ఏంటో చూపించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ‘జై బోలో తెలంగాణ’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరించిన వేణు ఉడుగుల ఆ తర్వాత ‘నీది నాది ఒకే కథ’ సినిమాతో డైరెక్షన్ బాట పట్టాడు. ఇక మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించిన ఆయన ఆ తర్వాత రానా తో ‘విరాట పర్వం’ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో ఆయన ఒకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ధనుష్ తో సినిమా చేయబోతున్న అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చినప్పుడు అందులో నిజం లేదనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ధనుష్ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడప్పుడే ఆయన వేణు ఉడుగులకు దొరికే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఈ సినిమాను వేరే హీరోతో చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన రాజు వెడ్స్ రాంబాయి సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఆయన ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు.
దాంతో మరోసారి అతని పేరు లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇక దాంతో ఇప్పుడు ఆయన చేయబోతున్న సినిమాల విషయంలోనే చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది… ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది తెలియాల్సి ఉంది…ఆయన ఒక రైటర్ గా, డైరెక్టర్ గా మంచి సక్సెస్ ని సాధిస్తున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ తో కూడా ఆయన ఒక సినిమా చేయాలనాకున్నాడు కానీ ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయింది. ఇక ఇప్పుడు వెంకటేష్ చేయాల్సిన ప్రాజెక్ట్ ను తెర మీదకి తెస్తాడా లేదంటే ధనుష్ తో చేయాల్సిన సినిమాని వేరే హీరోతో చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది…
వేణు ఉడుగుల లాంటి డైరెక్టర్ ఇలా బ్రేక్ ఇవ్వడం వల్ల తన నుంచి వచ్చే సినిమాలను ప్రేక్షకులు మిస్ అవుతుంటారు. కాబట్టి ఆయన కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది…