https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : విష్ణుప్రియ నవ్వు పై నిఖిల్ తల్లి సెటైర్లు..జాగ్రత్తగా మాట్లాడు అంటూ గౌతమ్ కి మాస్ వార్నింగ్!

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నడుస్తున్న ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ గా ముందుకు దూసుకుపోతుంది

Written By:
  • Vicky
  • , Updated On : November 14, 2024 / 08:55 AM IST

    Bigg Boss Telugu 8: Nikhil's mother satires on Vishnu Priya's smile..Mass warning to Gautham saying to be careful!

    Follow us on

    Bigg Boss Telugu 8 :   ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో నడుస్తున్న ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్ గా ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా నిఖిల్ తల్లి హౌస్ మేట్స్ అందరితో జరిపిన సంభాషణ హైలైట్ గా నిల్చింది. అందరితో బాగుంటునే, మరోపక్క తన కొడుక్కి ఎవరితో ఎలా ఉండాలో, బయట జనాలు ఏమి అనుకుంటున్నారో, అన్ని పూసగుచ్చినట్టు చెప్పి వెళ్తుంది. అయితే మనకి ఎపిసోడ్ లో చూపించింది కేవలం కొంత మాత్రమే. అన్ సీన్ కట్స్ లో నిఖిల్ వాళ్ళ అమ్మ హౌస్ మేట్స్ అందరితో ప్రేమగా మాట్లాడడం, వంట చేయడం, ఆ తర్వాత డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని అందరితో చిట్ చాట్ చేయడం వంటివి చేసింది. డైనింగ్ టేబుల్ వద్ద ఆమె కూర్చున్నప్పుడు గౌతమ్ మాట్లాడుతూ ‘మా అందరిలో ఉన్న నెగేటివ్స్ ని ఒక్క మాటలో చెప్పండి. మేము ఏమి మార్చుకోవాలో కూడా చెప్పండి’ అని అడుగుతాడు గౌతమ్.

    ముందుగా తన గురించి చెప్పమని గౌతమ్ అడగగా ‘మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడు’ అని అంటుంది. ఆ తర్వాత విష్ణు ప్రియ గురించి అడగగా, ‘ఆమె నవ్వు నాకు అసలు నచ్చదు..అలా నవ్వకుంటే చాలా బాగుంటుంది’ అని చెప్తుంది. నభీల్ గురించి అడగగా, అతనిలో ఏమి నెగేటివ్స్ లేవు, చాలా బాగా ఆడుతున్నాడు అని చెప్తుంది. అదే విధంగా యష్మీ గురించి అడగగా, ఆమె వాదించేటప్పుడు చేతులు కొట్టుకుంటూ మాట్లాడుతుంది, ఆ మ్యానరిజమ్స్ జనాలకు నచ్చడం లేదు, అది మార్చుకోవాలి అని అంటుంది. ఇక పృథ్వీ గురించి అడగగా ‘టాస్కులు ఆడేటప్పుడు కాస్త అగ్రెసివ్ అవుతాడు. అది పక్కన పెడితే ఆ అబ్బాయి చాలా మంచోడు. ఇంత నిజాయితీ గల అబ్బాయిని నేను ఎక్కడ చూడలేదు. ఐ లవ్ యూ’ అని పృథ్వీ తో అంటుంది. ఆ తర్వాత రోహిణి గురించి మాట్లాడుతూ ‘కొన్ని ఎక్స్ ప్రెషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. అకస్మాత్తుగా కొన్ని రియాక్షన్స్ ఇస్తావు, అది మార్చుకో’ అని అంటుంది.

    ఇక చివర్లో తన కొడుకు గురించి చెప్పమని అడగగా, వాడికి ఎమోషన్స్ ని అదుపులో పెట్టుకోవడం రాదు, అది ఒక్కటి నేర్చుకుంటే బాగుంటుంది అని అంటుంది. ఆ తర్వాత ఆమె కిచెన్ లోకి వెళ్లి ప్రేరణ తో కలిసి వంట చేస్తుంది. అప్పుడు అవినాష్ అక్కడికి వచ్చి ప్రేరణ చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ లాగా వ్యవహరిస్తుంది అని అంటాడు. అప్పుడు నిఖిల్ తల్లి దానికి సమాధానం ఇస్తూ, నాకు తెలుసు ఈమె టీచర్ అని అంటుంది. అప్పుడు తేజ మాట్లాడుతూ ‘అలా ఆమె అనుకుంటుంది కానీ, వాస్తవానికి ఆమె వార్డెన్ లాగా వ్యవహరిస్తుంది’ అని అంటాడు. ఇది విన్న తర్వాత బయట జనాలు అనుకుంటున్న విషయం తేజా కి ఎలా తెలిసింది అని ఆడియన్స్ ఆశ్చర్యపోతూ సోషల్ మీడియా లో ఈ విషయాన్ని ప్రస్తావించారు.