Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Balakrishna : పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాలయ్య కి ఆ రెండు సినిమాలంటే...

Pawan Kalyan Balakrishna : పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాలయ్య కి ఆ రెండు సినిమాలంటే చాలా ఇష్టమా..? ఇంతకి ఆ మూవీస్ ఏంటంటే..?

Pawan Kalyan Balakrishna : సినిమా ఇండస్ట్రీకి రాకముందే చాలామంది హీరోలు సినిమాకు సంబంధించిన ప్రతి క్రాఫ్ట్ లో ఎంతోకొంత నాలెడ్జ్ ను సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్లకు ఉన్న టాలెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తారు. ఇక ఇపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సినిమా ఇండస్ట్రీకి రాకముందే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని తను చేస్తున్న సినిమాలలో రియల్ స్టంట్స్ చేయడంతో ఆయన ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. తద్వారా స్టార్ హీరోగా మారడమే కాకుండా పవర్ స్టార్ అనే బిరుదును కూడా దక్కించుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడి గా వచ్చిన ఆయన అన్నకి తగ్గ తమ్ముడు గా ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటి నటుడు ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు…ఆయన కెరియర్ లో చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిలిచబెట్టాయి. ప్రస్తుతం జనసేన పార్టీని పెట్టి రాజకీయ రంగంలో రాణిస్తున్నాడు…

ఇక నందమూరి ఫ్యామిలీ హీరోల్లో నట సింహం బాలయ్య బాబు సైతం టాప్ హీరోగా ఎదిగాడు. మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. అలాంటి బాలయ్య బాబుకి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో చేసిన అన్ని సినిమాల్లో బాలయ్య బాబుకి రెండు సినిమాలు బాగా నచ్చుతాయట. ఆ సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చిన కూడా తను చూస్తానని గతంలోకి ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇంతకీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బాలయ్య కి నచ్చిన రెండు సినిమాలు ఏంటంటే ఒకటి ‘గబ్బర్ సింగ్’ సినిమా కాగ, మరొకటి అత్తారింటికి దారేది సినిమా కావడం విశేషం…

ఈ రెండు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ తన పూర్తి స్వాగ్ ను వాడుకొని మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడని చెబుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల పాటు ఫ్లాప్ పులను ఎదురుకున్న తర్వాత దక్కిన రెండు సూపర్ సక్సెసులు కూడా ఇవే కావడం విశేషం…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version