Manchu Manoj: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకరి సినిమాలు సక్సెస్ అయితే మరొక హీరో సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూనే వస్తుంది. స్టార్ హీరోలు సైతం ఒక హీరో సినిమా సూపర్ సక్సెస్ అయితే ఫోన్ చేసి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సినిమాకు సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ సినిమా సూపర్ సక్సెస్ అయిందంటూ కంగ్రాట్యులేషన్స్ అయితే తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి సందర్భంలోనే లిటిల్ హార్ట్స్ సినిమాతో మంచి విజయాన్ని సాధించిన మౌళి ప్రస్తుతం సంబరాలు చేసుకుంటున్నాడు. ఇక మిరాయి సినిమా సైతం గతవారం రిలీజ్ అయి సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమాలో విలన్ గా నటించిన మంచు మనోజ్ రీసెంట్ గా మిరాయి సినిమా సక్సెస్ మీట్ లో సినిమా హీరో అయిన మౌళి గురించి మాట్లాడుతూ
Also Read: ‘లిటిల్ హార్ట్స్ ‘ మూవీ డైరెక్టర్ వాళ్ల తాత కూడా దర్శకుడనే విషయం మీకు తెలుసా..?
‘నువ్వు నెక్స్ట్ సినిమా చేసేటప్పుడు ఆ కథ నాకు చెప్పి అందులో విలన్ గానో, లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాని ఒక క్యారెక్టర్ ఉందన్న నువ్వు చెయ్ అని చెబితే నేను నీ కోసం తప్పకుండా చేస్తాను తమ్ముడు’ అంటూ మాట్లాడాడు. ఇక మంచు మనోజ్ మాట్లాడిన వీడియోని ఎక్స్ లో అప్లోడ్ చేయగా అది చూసిన మౌళి మనోజ్ అన్న నువ్వు గోల్డ్ అంటూ రిప్లై ఇచ్చాడు.
ఇక దానికి మంచు మనోజ్ సైతం నువ్వు సూపర్ బోల్డ్ తమ్ముడు లవ్ యు అంటూనే పార్టీ లేదా పుష్ప అని అడిగాడు…దాంతో మౌళి నువ్వు ప్రత్యేకంగా అడగాలా అన్న నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ పార్టీకి నేను రెడీ అంటు రిప్లై ఇచ్చాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం వీళ్ళు చేస్తున్న ట్వీట్లు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే మౌళి ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సూపర్ హిట్ కొట్టాడు కాబట్టి మనోజ్ కి తన మీద రెస్పెక్ట్, ప్రేమ వచ్చాయని తెలుస్తున్నాయి…అందుకే తన గురించి స్పెషల్ గా మాట్లాడాడు…
ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట రాబోయే రోజుల్లో చాలామంది కొత్త దర్శకులు కొత్త కంటెంట్లతో సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఇందులో భాగంగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…