spot_img
Homeఎంటర్టైన్మెంట్Telugu Film Industry Hero Script Changes Issue: ఆ హీరోలకు కథ చెప్పాలంటే దర్శకులు...

Telugu Film Industry Hero Script Changes Issue: ఆ హీరోలకు కథ చెప్పాలంటే దర్శకులు వణికిపోతున్నారా… కారణం ఇదే…

Telugu Film Industry Hero Script Changes Issue: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ రేంజ్ లో సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే యంగ్ హీరోలు మాత్రం డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు మాత్రం కొత్త దర్శకులు కథలు చెప్పాలంటే భయపడిపోతున్నారట. ఎందుకంటే కొత్త డైరెక్టర్ రాసుకున్న కథలని వాళ్లకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాలని వాళ్ళు కోరుతున్నారట. ఇక వాళ్లకు తోడుగా నవీన్ పోలిశెట్టి, సందీప్ కిషన్, నాగ శౌర్య లాంటి హీరోలు సైతం దర్శకులు రాసుకున్న కథల్లో మార్పులు చేర్పులు చేస్తుండటం వల్ల కొత్త దర్శకుడు ఈ హీరోలకు కథలను చెప్పడానికి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్లు తమ వైఖరి మార్చుకుంటే కొత్త దర్శకులు గొప్ప కాన్సెప్ట్ లతో ప్రేక్షకుల ముందుకు రావడానికి అవకాశమైతే ఉంటుంది.

అలా కాకుండా తమకు నచ్చినట్టే సినిమా చేయాలని అనుకుంటే మాత్రం చాలా వరకు మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది. ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా సక్సెస్ లు వచ్చినవాళ్లకే క్రేజ్ ఉంటుంది. అవే ఇక్కడ కీలకమైనవి కాబట్టి ఒక సినిమాతో సక్సెస్ వస్తేనే హీరోలు కానీ, దర్శకులు కానీ ఇండస్ట్రీలో సర్వైవల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.

కానీ ఒక సినిమాతో ఫ్లాప్ వస్తే మాత్రం చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది… వాళ్లు అలా ఉండడంవల్ల కొన్నిసార్లు రిజల్ట్ వాళ్ళకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. కానీ అన్నివేళలా వాళ్ళే కరెక్ట్ అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు అంటూ సినిమా ఇండస్ట్రీలో ఉన్న పలువురు మేధావులు సైతం కామెంట్లు చేస్తున్నారు…

రాబోయే రోజుల్లో వీళ్ళందరు స్టార్ హీరోలుగా మారతారా? టైర్ వన్ హీరోలుగా మారే అవకాశాలు ఉన్నాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న హీరోలందరు టాప్ లెవల్లో దూసుకెళ్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular