Star Heroes: నట వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మన నటులు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటూ స్టార్ హీరోలుగా ఎదిగారు. అయితే చాలా మంది హీరోలు వాళ్ళు మాత్రమే స్టార్ హీరోలు గా ఎదిగారు. కానీ వాళ్ల బ్రదర్స్ మాత్రం ఇండస్ట్రీ కి రాలేదు దానికి కారణాలు ఏంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ఇక నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున… మొదట్లో కొన్ని సినిమాలు చేసి విమర్శలను ఎదుర్కొన్నప్పటికి, ఆ తర్వాత చేసిన సినిమాలతో తన స్టామినా ఏంటో చాటుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే నాగేశ్వరరావు పెద్ద కొడుకు అయిన అక్కినేని వెంకట్ సినిమాల్లోకి రాలేదు. నాగార్జున మాత్రమే సినిమాల్లోకి వచ్చాడు. అయితే నాగార్జున బ్రదర్ సినిమాల్లోకి రాకపోవడానికి పెద్ద కారణమేమీ లేదు. ఆయనకి సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అందువల్లే తను సినిమాల్లోకి రాకుండా బిజినెస్ లు చూసుకుంటున్నాడు అని చాలా సార్లు నాగార్జున ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు.
ఇక కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తెలుగులో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వాళ్ల సోదరుడైన ప్రమోద్ ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేదు అనే విషయం మీద ప్రభాస్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆయనకి నటన మీద పెద్దగా ఆసక్తి లేదు. తను ఎప్పుడు ప్రొడ్యూసర్ అవ్వాలని అనుకున్నాడు. ఇక అందులో భాగంగానే యూవీ క్రియేషన్స్ అనే బ్యానర్ ని స్టార్ట్ చేసి అందులో మంచి సినిమాలు నిర్మిస్తున్నాడు అంటూ ప్రభాస్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చాడు…
ఇక డాక్టర్ డి రామానాయుడు కొడుకు గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ చాలా తక్కువ సమయం లోనే విక్టరీ వెంకటేష్ గా తనకంటూ ఒక బ్రాండ్ నేమ్ ను అయితే సంపాదించుకున్నాడు. కానీ వెంకటేష్ వాళ్ల అన్నయ్య సురేష్ బాబు మాత్రం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక దానికి కారణం ఏంటి ఒక ఇంటర్వ్యూలో సురేష్ బాబు ను అడగగా ఆయన మాట్లాడుతూ ‘ చిన్నప్పటి నుంచి మా నాన్న నన్ను ప్రొడ్యూసర్ ను, మా తమ్ముడిని హీరోని చేద్దామనుకున్నాడు’. బహుశా ఆయన నన్ను హీరో చేయాలనుకోకపోవడం వల్లే నేను హీరో అవ్వలేదు ఏమో అంటూ చాలా ఫన్నీగా సమాధానాన్ని చెప్పాడు…