Chiranjeevi: ఒకప్పుడు చిరంజీవి హీరోగా ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఆ సినిమాని మొదటి రోజు మొదటి షో చూడడానికి ప్రతి ప్రేక్షకుడు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఇప్పటి లాగా అప్పుడు టికెట్స్ బుకింగ్స్ యాప్స్ ఏమి లేవు కాబట్టి ఆయన సినిమా టికెట్ల కోసం గంటల తరబడి చాలామంది అభిమానులు క్యూ లైన్ లో నిల్చునే వారు, ఇక టికెట్లు దక్కించుకోవడానికి అప్పుడప్పుడు కొట్టుకునేవారు.
అలాగే టికెట్స్ కోసం లైన్ లో నుంచుంటే ఒక్కొక్కరి చొక్కాలు కూడా చిరిగిపోయేవి. ఇక మాస్ లో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న చిరంజీవి ఒక దర్శకుడు తో చేసిన రెండు సినిమాలు మాత్రం పెద్దగా ఆడకపోవడం అనేది ఇప్పటికీ ఆయనకి ఒక తీరని లోటు గా మిగిలిపోయిందనే చెప్పాలి. అవి ఏ సినిమాలు అంటే కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ స్వయం కృషి ‘, ‘అపద్బాంధవుడు’ ఈ రెండు సినిమాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, కమర్షియల్ గా మాత్రమే ఈ సినిమాలు పెద్దగా సక్సెస్ సాధించలేదు.
దానికి కారణం ఏంటి అంటే అప్పటికే చిరంజీవి మాస్ హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక అలాంటి సమయంలో ఇవి చాలా క్లాస్ సినిమాలు కాబట్టి వీటిని చూసి చిరంజీవి అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. చిరంజీవి సినిమా అంటే స్క్రీన్ మీద ఫైట్లు, పాటలు, డాన్స్ లతో థియేటర్ దద్ధరిల్లి పోయేది, కానీ అవి ఏమీ ఈ సినిమాలో ఉండవు. కాబట్టి ఈ సినిమాని చూడటానికి ప్రేక్షకులు ఎవరు పెద్దగా ఆసక్తి చూపించలేదు. అందువల్లే ఈ సినిమాలు పెద్దగా ఆడలేదని చెప్పాలి. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. చిరంజీవి 70 సంవత్సరాల వయసుకు దగ్గరలో ఉన్న కూడా ఈ సినిమా కోసం విపరీతంగా కష్ట పడుతున్నట్లుగా తెలుస్తుంది.
ఇక రీసెంట్ గా ఆయన జిమ్ లో ఒక వీడియోని కూడా వదిలాడు. విశ్వంభర సినిమా కోసమే చిరంజీవి చాలా వర్కౌట్స్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ సినిమాని చిరంజీవి చాలా ప్రస్టీజియస్ గా తీసుకొని చేస్తున్నట్టు గా తెలుస్తుంది…